అనిల్ రాచమళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ రాచమళ్ళ
జననం (1971-10-01) 1971 అక్టోబరు 1 (వయస్సు 50)
వృత్తిటెక్ గురు, స్పీకర్‌, రచయిత, కాలం రైటర్, రేడియో జాకీ,

అనిల్ రాచమళ్ళ రచయిత, టెక్ గురు, కరమవీర్ చక్ర పురస్కార గ్రహీత. మహిళలు, యువత, పిల్లలలో నెట్ వాడకంలో భాధ్యతాయుతమైన అవగాహనా సరళిని ప్రేరేపించడానికి ఇంటర్నెట్ ఎథిక్స్, డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహించే దిశగా ఎండ్ నౌ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి నడుపుతున్నారు.ఇది ఆసియాలోని మొదటి లాభాపేక్షలేని సంస్థ.


వ్యక్తిగత జీవితం[మార్చు]

అనిల్ 1971 సంవత్సరం అక్టోబర్ 10 వతేదీ హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులు డా.వెంకటేశ్వర్లు, డా. పుష్పవల్లి. ఈయనకు భార్య , ఇద్దరు పిల్లలు.

విద్య[మార్చు]

అనిల్ తన విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేసారు. 1994 లో ఇంజనీర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసారు. తదుపరి 2010 లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో M.B.A చేసారు. ఆపై వాల్యూ చైన్, సిక్స్ సిగ్మా, సర్వీస్ డెలివరీ, సైబర్ సెక్యూరిటీ వంటి అంతర్జాతీయ సర్టిఫికెట్ కోర్సులను చేసారు.

వృత్తి విశేషాలు[మార్చు]

ఇంటర్నెట్ ఎథిక్స్ & డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఫ్రీ స్పీచ్, నెట్ న్యూట్రాలిటీ, ప్రజా విధాన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉన్న ఈయన స్పీకర్‌గా అనేక టీవీ, రేడియో కార్యక్రమాల్లో ప్రసంగించారు. పత్రికల్లో రైటర్‌గా 55 కాలమ్స్, 04 రీసెర్చ్ పేపర్లు సమర్పించారు. వ్యక్తిగతంగా 250 పైబడి వివిధ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 29 వర్క్‌షాప్‌లు నిర్వహించారు. 11 ఎగ్జిబిట్‌లు, 24 ప్యానెల్ చర్చలు చేసారు. రేడియో జాకీగా 65 ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు చేసారు.

ఇవే కాక

 • రేడియో సిటీ ఎఫ్.ఎం లో సైబర్ గురుగా ప్రశ్నా కార్యక్రమం
 • తెలంగాణా టుడే వార్తాపత్రికలో సైబర్ టాక్స్ అనే పేరున వ్యాసాలు
 • హైదరాబాద్ యూనివర్సిటీ ద్వారా జి., పి.జి. విద్యార్ధులకు డిజిటల్ కోర్సుల్లో శిక్షణ వంటి మరెన్నో కార్యక్రామాలలో పాల్గొన్నారు.


ఎండ్ నౌ సంస్థ[మార్చు]

అనిల్ రాచమల్ల గారు ఎండ్ నౌ ఫౌండేషన్ యొక్క స్థాపకుడు, ఈ ఫౌండేషన్ భారత దేశం లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంటర్నెట్ ఎథిక్స్, డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహిస్తున్న ఏకైక సంస్థ.

రచనలు, పుస్తకాలు[మార్చు]

అనిల్ రాచమల్ల ప్రతిభావంతమైన రచయిత. ఇంటర్నెట్ ఎథిక్స్, డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహించడంపై పలు పుస్తకాలను రచించారు. ఇవన్నీ అమెజాన్‌ పేపర్‌బ్యాక్, కిండిల్ వెబ్ సైట్‌లో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.

అనిల్ రాచమళ్ళ ద్వారా వెలువడిన కొన్ని పుస్తకాలు

 1. Uncovering Fake News
 2. Is Privacy a Myth?
 3. Consent & Data Why is it Different Online ?
 4. Cyberbullying
 5. Digital Parenting
 6. Digital Addiction
 7. Cyber Crime Against Women and Children
 8. Managing Negative Comments Online
 9. Impact of Digital Technology on Human Wellness

వ్యాసాలు, పరిశోధనలు, కోర్సులు[మార్చు]

 • డిజిటల్ వెల్‌బీయింగ్ క్రెడిట్ కోర్స్ - వివిధ అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానంతో సమతుల్యత యొక్క అవసరాన్ని మహిళలు & పిల్లలు గ్రహించడంలో సహాయపడటానికి ఈ కోర్సు రూపొందించబడింది.
 • డిజిటల్ సెక్యూరిటీ - టూల్స్ & టెక్నిక్స్
 • డిజిటల్ భద్రత - మనిషి శారీరక & మానసిక శ్రేయస్సు కొరకు రూపొందించబడినది
 • డిజిటల్ స్పిరిట్ - చట్టపరమైన, నైతిక సమస్యలపై అవగాహన సలహాలతో వివరణాత్మక పుస్తకం

వివిద కార్యక్రమాలు[మార్చు]

 • సైబర్ యోధ - రాచకొండ పోలీస్ అనుబంధంతో
 • డిల్సే - సైబరాబాద్ పోలీస్ అనుబంధంతో
 • సైబర్ రక్షక్ - తెలంగాణ పోలీస్ అనుబంధంతో
 • సైబర్ సురక్ష - అవగాహన చర్చలు
 • సైబర్ గురు - రేడియో F.M. కార్యక్రమం
 • సైబర్ టాక్ - వీక్లీ న్యూ పేపర్ కాలమ్ “తెలంగాణ టుడే న్యూస్ పేపర్” అనుబంధంతో
 • డిజిటల్ వెల్‌బీయింగ్ క్రెడిట్ కోర్స్ (యూజ్/పీజీ స్టూడెంట్స్ కొరకు) - యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ అనుబంధంతో


పురస్కారాలు[మార్చు]

 • 2020 లో భద్రతాపరమైన అవగాహన పెంచడంపై డి.ఎస్.సి.ఐ వారి ప్రత్యేక పురస్కార్ం (“DSCI Excellence 2020 - Special Jury Award - Raising Security Awareness” 2020)
 • 2019 లో కర్మవీర్ చక్ర బంగారుపతకం (“Karmaweer Chakra - Gold Medal” 2019)
 • 2019 లో సైబర్ సేవలకు "Unsung Heroes" of the Year 2019
 • 2019 లో విశిష్ట సేవా పురస్కారం “Vasista Seva Puraskar” 2019 .
 • 2019 లో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్‌సర్ “Social Media Influencer” 2019 .
 • 2018 లో హైదరాబాద్ హీరోస్ “Hyderabad Heroes” 2018 .
 • 2018 లో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్‌సర్ ”Social Media Influencer” 2018 .


మూలాలు, ఆధారాలు[మార్చు]

 1. https://www.amazon.in/Mr.-Anil-Rachamalla/e/B08QV6HH2C%3Fref=dbs_a_mng_rwt_scns_share
 2. https://telanganatoday.com/ngo-spreads-awareness-on-cyber-safety-in-hyderabad
 3. https://www.newindianexpress.com/states/telangana/2020/oct/24/post-data-breach-at-dr-reddys-firms-urged-to-combat-cybercrime-2214456.html
 4. https://www.rachhabandanews.com/english/tag/anil-rachamalla/
 5. https://indtoday.com/anil-rachamalla-conferred-with-karmaveer-chakra-award/
 6. https://events.vtools.ieee.org/m/228994
 7. https://in.pinterest.com/pin/681732462327563902/