Jump to content

అనురాధ మెహతా

వికీపీడియా నుండి
అనురాధ మెహతా
ఏప్రిల్ 08, 1981
మైసూర్, కర్ణాటక, భారతదేశం
ఇతర పేర్లుఅను మెహతా, మాక్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2003–2008

అనురాధ మెహతా భారతీయ సినిమా నటి, మోడల్. తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది.[1]

జననం

[మార్చు]

అనురాధ మైసూర్ లో జన్మించింది.

సినిమారంగ ప్రస్థానం

[మార్చు]

మోడలింగ్ ను వృత్తిగా స్వీకరించిన అనురాధ, 2004లో వచ్చిన ఆర్య లో గీతా అన్నే పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది. దీని తర్వాత ఈమె 2005 లో ఇ. వి. వి. సత్యనారాయణ నిర్మాణ, దర్శకత్వంలో ఆయన ఇద్దరు కొడుకులు ప్రధాన పాత్రధారులుగా వచ్చిన నువ్వంటే నాకిష్టం అనే సినిమాలో నటించింది. 2006 లో అజయ్ అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. తెలుగులో ఒక్కడు సినిమాకు పునర్నిర్మాణమైన ఈ చిత్రంలో ఈమె పునీత్ రాజ్‌కుమార్ సరసన కథానాయికగా నటించింది.

2008 లో వచ్చిన కన్నడ చిత్రం హొంగనసు తర్వాత ఈమె మరే చిత్రంలోనూ నటించలేదు.

చిత్ర సమహారం

[మార్చు]
సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఙతర వివరాలు
2004ఆర్య[2]గీతతెలుగు
2005నువ్వంటే నాకిష్టంరాధతెలుగు
2006అజయ్పద్దుకన్నడ
2007మహారాజశ్రీతెలుగు
2007వేడుకఅమ్ముతెలుగు
2008హొంగనసుకన్నడ

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అనురాధ మెహతా,Anuradha Mehtha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.