అన్నమయ్య గ్రంథాలయం

వికీపీడియా నుండి
(అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అన్నమయ్య గ్రంథాలయం
(ANNAMAYYA LIBRARY)
Annamayya library.JPG
గ్రంథాలయం ముంగిలి
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
ప్రదేశముగుంటూరు
భౌగోళికాంశాలు016°18′03″N 080°26′34″E / 16.30083°N 80.44278°E / 16.30083; 80.44278
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య80, 000

అన్నమయ్య గ్రంథాలయం దాదాపు 80 వేల గ్రంథాలతో గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం[1]. ఈ గ్రంథాలయానికి మొదటి ధాత శ్రీ కంభం శ్రీనివాస్ గారు. తదనంతరం మహామహులెందరో ముందుకు వచ్చి దీనిని ప్రసిద్ధ గ్రంథాలయంగా మార్చారు.

అభివృద్దిలో ప్రముఖులు, పుస్తక దాతలు[మార్చు]

గోగినేని కనకయ్య[మార్చు]

వెలగా వెంకటప్పయ్య[మార్చు]

వెలగా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రదేశ్లో పౌర గ్రంథాలయోద్యమానికి చాలా సేవ చేసారు., తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడు. శాఖా గ్రంథాలయములో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారాపి.హెచ్.డి పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు. గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.

పెద్ది వెంకటేశ్వరరావు[మార్చు]

పెద్ది వెంకటేశ్వరరావు గారు అన్నమయ్య గ్రంథాలయ అభివృద్ధిలో ప్రముఖులు. ఈయన గత 10 ఏళ్ళుగా ఆన్నమయ్య గ్రంథాలయానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు.

కొండబోలు బసవ పున్నయ్య[మార్చు]

ఈయన ఈ గ్రంథాలాయానికి లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా మరిన్ని పుస్తకాలు చేర్చబడ్డాయి.

లంకా సూర్యనారాయణ[మార్చు]

ఈ గ్రంథాలయానికి అత్యధికంగా 60.000 సుమారు పుస్తకాలు ఇచ్చిన దాత. సేవారత్న అవార్డు గ్రహీత. ఈయన చిన్నతనం నుంచి తాను చదివేందుకు సేకరించిన అనేక పుస్తకాలను ఈ గ్రంథాలయ అభివృద్ధికై ఇచ్చివేసారు.

గుంటూరు బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం కమిటి చొరవ[మార్చు]

1999లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. అయినా కొన్నాళ్ళ పాటు ఆ పుస్తకాలు స్వామివారి ఆలయంలో ధ్యాన మందిరంలో ఉండి పోవటం బాధగా అనిపించి కొందరు దాతలు విరాళాలు అందించారు. క్రమంగా బీరువాల సంఖ్య 100కు చేరింది.

తిరుమల తిరుపతి దేవస్థానం చేయుత[మార్చు]

ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రంథాలయ పరిస్థితిని, దాని అమూల్య సంపద గురించి తెలుసుకొని గుంటూరులోని ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా రూపుదిద్దటానికి చేయూత నిస్తున్నారు.

అతిధులు[మార్చు]

అన్నమయ్య గ్రంథాలయ ముఖద్వారం
A Training Session With Staff of Annamayya Adhyatmika Librery

ఈ గ్రంథాలయానికి తరచుగా వచ్చు కొందరు పెద్దలు, వక్తలు, రచయితలు, గ్రంథ సేకరణ కర్తలు తదితర అతిధుల గురించిన సమాచారం

పొత్తూరి వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ద్వారా భావితరాలకు పనికివచ్చే కార్యక్రమాలకు రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు2015 జనవరి 29 న అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, రాష్ట్రప్రభుత్వ ఉత్తమ జర్నలిష్టు అవార్డు వంటి పలు సత్కారాలు అందుకున్నారు. వీరు ప్రముఖ పాత్రికేయులు. 4 దశాబ్దాల పాటు వివిధ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

వీరు గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఈ సేకరణ అరుదైనదని ప్రశంసించారు. వీరు ప్రెస్ అకాడమి అధ్యక్షులుగా ఉన్నపుడు పాతపత్రికలను 10 లక్షల పుటలను డిజిటల్ రూపంలో భద్రపరచారు. ప్రస్తుతం అన్నమయ్య గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథ పట్టిక డిజిటలైజేష గురించి వివరాలు తెలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అవసరమైన మెళకువలను సూచించారు. ప్రముఖుల పరిచయాలను అదే రంగంలో అనుభవం గల వారిచే ఇంటర్వూ చేయించి పదిలపరచటం అవసరం అన్నారు.

కుర్రా జితేంద్రబాబు

కుర్రా జితేంద్రబాబు గారు త్రిభాషా పండితులు. ఈయన తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతంలో మహా పండితులు డెక్కన్ ఆర్‌ఖ్యలాజికల్ ఎండ్ కల్‌చరల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, వేమన ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నారు. డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వ విద్యాలయాల కొలమానంలో ఇతనొక సైన్స్ విద్యార్థి. న్యాయశాస్త్ర పట్టభద్రుడు. స్వతహాగా లోక సంచారి. ఇతనికి ఒంటబట్టింది చరిత్ర, సాహిత్యం, సామాజిక, మనోవిజ్ఞాన తత్త్వ శాస్త్రాలు. “ఒంటరిగా సంచరిస్తూ, పలువురిలా శ్రమిస్తూ” అనితర సాధ్యంగా వేల గ్రంథాలను సేకరించడమే కాకుండా ఆమూలాగ్రం మస్తిష్కంలో భధ్రపరచుకున్న ఏకసంథాగ్రాహి. యుద్ధాలు, విప్లవాలు, ఆరంభాలు, అంతాలు, తారీఖులు, దస్తావేజులు అన్నీ అతని నాలుక మీద మీట నొక్కితే కంపుటర్ లోంచి ప్రత్యక్షమైనట్లుగా నర్తిస్తాయి. ఆయా సన్నివేశలను అద్భుతంగా కళ్లకు కనిపిస్తాయి. నిజాం ఆంధ్రరాష్ర్ట మహాసభలు, హైదరాబాదు సంస్థానం ప్రజా ఉద్యమాలుని రచించారు. అనేక పుస్తకాలను అనువదించారు.

పెద్ది రామారావు

పెద్ది రామారావుగారు....తెలుగు భాషని ఒక వైవిధ్యమైన బాటలో నడిపిస్తూ, భాషాభివృధ్ది చేస్తూ ముందుకు సాగుతున్నారు. రామారావు గారు ధియేటర్ ఆర్ట్స్‌లో పి.హెచ్ డి చేసారు, హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ధియేటర్ ఆర్టిస్ట్‌లకు తమదైన శైలిలో పాఠాలను నేర్పి తన ఉనికిచాటుకుంటున్నారు. "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడుపుతున్నారు. ధియేటర్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటన్నిటిని త్వరలో ఒక చక్కని పుస్తక రూపంలో మన ముందుకు తీసుకురాబోతున్నారు.శనివారం (21/2/2015) న వీరు తమ ప్రదేశమైన గుంటూరు నగరానికి వచ్చి ఈ యొక్క అన్నమయ్య గ్రంథాలయాన్ని కూడా సందర్శించారు.తమ యొక్క అమూల్యమైన స్పందనని ఈ విధంగా తెలియజేసారు. "అభిరుచి తో పనిచేయడం అంటే ఏమిటో ఈ గ్రంథాలయానికి వచ్చాక అర్థం అయ్యింది,ఆ అభిరుచి పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు జీవితానికి ఏర్పడే సార్థకతకి సరిహద్దులు ఉండవు". "సూర్యనారాయణ గారికి హాట్స్ ఆఫ్ అని అభినందిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసారు."

ఇతర విశేషాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవీచూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]