అన్నమయ్య గ్రంథాలయం

వికీపీడియా నుండి
(అన్నమయ్య గ్రంధాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అన్నమయ్య గ్రంథాలయం
అన్నమయ్య గ్రంథాలయం (ధార్మిక విజ్ఞాన ప్రాంగణం) ప్రవేశ ద్వారం
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
ప్రదేశముగుంటూరు
భౌగోళికాంశాలు016°18′03″N 080°26′34″E / 16.30083°N 80.44278°E / 16.30083; 80.44278
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య100, 000 [1]

అన్నమయ్య గ్రంథాలయం బృందావన్ గార్డెన్స్, గుంటూరు లో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం.లక్షకు పైగా పుస్తకాలు ఉన్నాయి.90 శాతం పైగా లంకా సూక్యనారాయణ సేకరించి దానం చేసినవి.

చరిత్ర[మార్చు]

1999లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. వెలగా వెంకటప్పయ్య తొలిగా తనదగ్గరున్న విస్తారమైన గ్రంథ సంపదను దానం చేశాడు. ఆ తరువాత లంకా సూర్యనారాయణ చిన్నతనం నుంచి తాను చదివేందుకు సేకరించిన అత్యధికంగా సుమారు 60,000 పుస్తకాలు దానం చేసాడు.[2] దీని అభివృద్ధికి కృషి చేసినవారిలో కంభం శ్రీనివాస్, పెద్ది వెంకటేశ్వరరావు,కొండబోలు బసవ పున్నయ్య వున్నారు.

ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా రూపుదిద్దటానికి చేయూతనిస్తున్నారు.

గ్రంథ సంపద[మార్చు]

అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం

దీనిలో సుమారు ఒక లక్ష గ్రంథాలున్నాయి. భాషా పరంగా 70,000 తెలుగు భాషవి 30,000 ఆంగ్లభాషవి.[1] 500 రామాయణ సంబంధిత పుస్తకాలు, 100 మహాభారతం, భగవద్గీత సంబంధించిన పుస్తకాలు, 5000 జీవిత చరిత్రలు, 750 నిఘంటువులు, 3000 తెలుగు కథ,వ్యాస,నాటక సంకలనాలున్నాయి. ఇంకా 50 సంవత్సరాలపైగా వార్తాపత్రికలు, పేపరులోని ముఖ్యాంశాల సేకరణలు కూడా వున్నాయి.[2]

గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రముఖులలో పొత్తూరి వెంకటేశ్వరరావు, కుర్రా జితేంద్రబాబు, పెద్ది రామారావు వున్నారు.

చిత్రమాలిక[మార్చు]


ఇవీచూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ravi P.Benjamin (2014-11-02). "Annamayya Library: a treasure trove of knowledge". The Hans India.
  2. 2.0 2.1 P. Samuel Jonathan (2012-03-15). "Source of literary and spiritual nourishment". The Hindu.