అప్పగింతలు (సినిమా)

వికీపీడియా నుండి
(అప్పగింతలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అప్పగింతలు
(1962 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం కొంగర జగ్గయ్య,
రాజసులోచన,
జె.వి.రమణమూర్తి
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఎం.ఎం.పిక్చర్స్
భాష తెలుగు

అప్పగింతలు - వి.మధుసూదనరావు దర్శకత్వంలో ఎం.ఎం.పిక్చర్స్ పతాకంపై నిర్మించబడి 1962 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా.

తారాగణం

[మార్చు]
  • జగ్గయ్య - రామదాసు
  • జమున - లక్ష్మి
  • రాజసులోచన - తార
  • రమణమూర్తి - వేణు
  • రమణారెడ్డి
  • అనూరాధ - సుబ్బులు
  • హేమలత
  • కె.వి.ఎస్.శర్మ - రామచంద్రయ్య
  • వై.వి.రాజు - వెంకటాద్రి
  • విజయలక్ష్మి
  • సాధన

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి.మధుసూదనరావు
  • కథ, మాటలు: డి.వి.నరసరాజు
  • సంగీతం: బి.గోపాలం
  • గీత రచన: నార్ల చిరంజీవి
  • ఛాయాగ్రహణం: దొరై
  • శబ్దగ్రహణం:టి.కృష్ణారెడ్డి
  • నిర్మాత: పి.శ్రీరామమూర్తి

రామచంద్రయ్య, వెంకటాద్రి ఇరుగుపొరుగు రైతులు. రామచంద్రయ్యకు రామదాసు, వేణు, సుబ్బులు సంతానం. వెంకటాద్రికి తార, లక్ష్మి కుమార్తెలు.

రామదాసుకు ఇల్లు, పొలం తప్ప మరే ధ్యాస లేదు. అతడు లక్ష్మిని ప్రేమించాడు. కాని లక్ష్మి అతడిని ప్రేమించలేదు. అమెరికా వెళ్ళి చదువుకొంటున్న వేణును ప్రేమించింది. అయితే ఇంటా బయటా కూడా అందరూ లక్ష్మికి, రామదాసుకు పెళ్లవుతుందనే అనుకున్నారు.

వేణు అమెరికానుంచి వచ్చాడు. లక్ష్మిని చూశాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే లక్ష్మి రామదాసుకు ఇచ్చి పెళ్లిచేయబడుతుందనే సంగతి వేణు విన్నాడు. ఖిన్నుడైనాడు. అలాగే లక్ష్మికూడా వేణుకు వివరించింది. ఒక్కింత దూరంలో నిలబడి వారి మాటలు విన్న రామదాసు హృదయంలో కల్లోలం రేగింది. అయిత అతను నిగ్రహించుకున్నాడు. తన ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మి ఆనందమే తన ఆనందమనుకున్నాడు. తాను లక్ష్మిని పెళ్లిచేసుకోనన్నాడు. రామచంద్రయ్యకు ఒళ్లుమండింది. కొట్టి బయటకు గెంటివేసి ఆ ముహూర్తంలోనే లక్ష్మిని వేణుకు ఇచ్చి పెళ్లి చేశాడు.

వేణు, లక్ష్మి హైద్రాబాదుకు వెళ్లారు. తొలి రోజుల అనురాగం అట్టేకాలం నిలవలేదు. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన లక్ష్మి అంటే వేణుకు వెగటు పుట్టింది. ఆధునిక వేషాలంకృత అయిన తారపై మోజు కలిగింది. ఆమెతో విందులు, షికార్లు ప్రారంభించాడు. అప్పులపాలైనాడు. లక్ష్మి గర్భవతి. రామదాసు తమ్ముణ్ణి చూడవచ్చి జరుగుతున్న గందరగోళం గమనించి వేణుకు బుద్ధి చెబుతాడు. అయినా అతని తలకు ఆ హితబోధలేవీ ఎక్కలేదు. లక్ష్మి పుట్టింటికి వచ్చింది. తార కూడా వచ్చింది.

తన సంసారంలో చిచ్చుపెట్టవద్దని లక్ష్మి తారను బ్రతిమాలింది. "నన్ను తలుచుకునే నీ భర్త నీతో కాపురం చేస్తున్నాడు. నీబిడ్డకు నా పోలిక వున్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు" అని తార అంది. లక్ష్మి మనస్సు చివుక్కుమంది. అటువంటి పని అన్యాయమే కాగలదంది. తన బిడ్డను చంపి వేస్తానంది కూడా.

బిడ్డ పుట్టింది. డాక్టరు సలహాపై బిడ్డను మరొకచోట వుంచారు. ఆ బిడ్డమీద లక్ష్మికి మమత హెచ్చింది. లేవలేని స్థితిలో బిడ్డ ఉన్నచోటుకు పరుగెత్తింది.

లక్ష్మి చనిపోతూ తన కుమార్తెను రామదాసుకు అప్పగించింది. ఆ కుమార్తె పెరిగి పెద్దదై తనకు మేనమామతో పెళ్లివద్దని తన క్లాసుమేటును పెళ్లాడతానని పెంపుడు తండ్రి రామదాసుతో చెబుతుంది. రామదాసు అది సరైన అభిప్రాయం కాదంటూ ఆమె తల్లి కథను చెబుతాడు.[1]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను నార్ల చిరంజీవి వ్రాయగా బి.గోపాలం స్వరకల్పన చేశాడు.[2]

క్ర.సం పాట పాడినవారు
1 ఒరె ఒరె ఒరె తస్సదియ్యా తలచుకొంటె ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం
2 చిరునవ్వే వరహాలురా ఓ బావా నీ కనుచూపే పి.సుశీల
3 మల్లె పందిరి పూసేవేళ మది తొందర చేసేవేళ పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
4 రాజూ రాణి పెళ్ళి రారండి బొమ్మల పెళ్ళి పి.సుశీల బృందం
5 విరిసే ఈ రేయి నీదే ప్రియా వలచీ పిలచే రారా నీచెలి పి.సుశీల
6 కాలిపోయే వోత్తికి కడకు దక్కు ( పద్యం )
7 పచ్చ పచ్చని తోట చిన్నారి చిలుకా పాడుకుందామే పిఠాపురం నాగేశ్వరరావు,జిక్కి
8 జిలిబిలి పాపా నా కనుపాపా నీ చిరునవ్వే నా జీవం పి.సుశీల
9 ఆలూ మగలూ నోచిన నోమే కోరిన తీయని సంసారం పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (6 July 1962). "చిత్రసమీక్ష - అప్పగింతలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 24 February 2020.
  2. కొల్లూరి భాస్కరరావు. "అప్పగింతలు - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

[మార్చు]