Jump to content

అఫ్జల్ మహమ్మద్ అహమ్మద్

వికీపీడియా నుండి
అఫ్జల్‌ మహమ్మద్‌ అహమ్మద్‌ 'గీటురాయి' వారపత్రిక సంపాదాకులు, ప్రముఖ రచయిత ఎస్‌.ఎం మలిక్‌ ప్రేరణతో 1979లో 'నవరక్తం రావాలి' రచన గీటురాయి వారపత్రికలో ప్రచురితం అయినది

బాల్యము

[మార్చు]

అఫ్జల్‌ మహమ్మద్‌ అహమ్మద్‌ పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో 1963 నవంబర్‌ 21న జన్మించారు. కలంపేరు: అఫ్జల్‌ఇండియన్‌. తల్లితండ్రులు: షేక్‌ సాబెరున్నీసా, మహమ్మద్‌ ఇబ్రహీం. చదువు: ఎం.ఎ. వ్యాపకం: వ్యాపారం.

రచనా వ్యాసంగము

[మార్చు]

వీరు 'గీటురాయి' వారపత్రిక సంపాదాకులు, ప్రముఖ రచయిత ఎస్‌.ఎం మలిక్‌ ప్రేరణతో 1979లో 'నవరక్తం రావాలి' రచన గీటురాయి వారపత్రికలో ప్రచురితం అయినది.. అప్పటి నుండి వివిధ వార పత్రికలలో అనేక వ్యాసాలు, క వి త ల చోటు చేసుకున్నాయి. కవితల్లో ఆరు ఆంగ్లంలో అనువాదామై పత్రికల్లో ప్రచురితం కాగా మరో పది కవితలు హిందీలో తర్జుమా చేయబడి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. నలభై అక్షరాలకు మించకుండ నాలుగు చరణాలతో, నాల్గవ చరణంలో భావం బలంగా 'పంచ్‌' అయ్యే విధాంగా 'సాహిరీలు' పేరుతో నూతన కవితా ప్రకియ ఆరంభించారు.

ప్రచురణలు

[మార్చు]

వీరి ప్రచురణలు. 1.నైతిక జీవితం, 2. చరితార్థులు. లక్ష్యం: ఇస్లాం విశ్వప్రేమ స్వభావాన్ని, స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడం.

మూలాలు

[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 39