అమల్ సిల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమల్ సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంపత్వాదుగే అమల్ రోహిత సిల్వా
పుట్టిన తేదీ12 December 1960 (1960-12-12) (age 63)
మొరటువా, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి బ్యాట్స్‌మెన్
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 23)1983 మార్చి 11 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1988 ఆగస్టు 25 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1984 నవంబరు 3 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1985 అక్టోబరు 25 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 9 20
చేసిన పరుగులు 353 441
బ్యాటింగు సగటు 25.21 22.05
100లు/50లు 2/0 0/3
అత్యధిక స్కోరు 111 85
క్యాచ్‌లు/స్టంపింగులు 33/1 17/3
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 9

సంపత్వాదుగే అమల్ రోహిత సిల్వా, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1983 నుండి 1988 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు, 20 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఎడమ చేతి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. శ్రీలంకకు బ్యాటింగ్ ప్రారంభించాడు.

జననం, విద్య[మార్చు]

సంపత్వాదుగే అమల్ రోహిత సిల్వా 1960, డిసెంబరు 12న శ్రీలంకలోని మొరటువాలో జన్మించాడు. మొరటువాలోని సిల్వా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాలో, కొలంబోలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో చదివాడు.[2]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

న్యూజిలాండ్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.[3] 1984లో డి అల్విస్‌కు గాయం కారణంగా, సిల్వా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతో శ్రీలంకతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1వ టెస్టులో లార్డ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అజేయంగా 102 పరుగులు చేశాడు. భారత్‌తో జరిగిన తదుపరి టెస్ట్ సిరీస్‌లోని మొదటి టెస్టులో 9 క్యాచ్‌లు తీసుకున్న తర్వాత, 2వ టెస్టులో మరో 8 క్యాచ్‌లు తీసుకున్నాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 111 పరుగులు చేయడంతోపాటు 22 ఔట్‌లు చేశాడు. ఇది శ్రీలంక క్రికెట్ లో రికార్డుగా నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. "Amal Silva Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  2. Cambrians field a formidable team this year Archived 2013-06-20 at Archive.today
  3. "SL vs NZ, Sri Lanka tour of New Zealand 1982/83, 2nd Test at Wellington, March 11 - 15, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.

బాహ్య లింకులు[మార్చు]