అమీనాపూర్ చెరువు
Appearance
అమీనాపూర్ చెరువు | |
---|---|
ప్రదేశం | అమీనాపూర్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
రకం | జలాశయం |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
అమీనాపూర్ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని పటాన్ చెరువు సమీపంలోని చెరువు.[1] ఈ చెరువును తెలంగాణ ప్రభుత్వం జీవవైవిధ్య వారసత్వ సంపద కలిగిన ప్రదేశంగా గుర్తింపునిచ్చింది.[2]
గుర్తింపు
[మార్చు]ప్రతి చలికాలంలో ప్లెమింగో వంటి అరుదైన పలు రకాల పక్షులు, అందమైన కొంగలు, వివిధ దేశాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ చెరువులో 171 రకాల పక్షులు, 250 జాతుల చెట్లు, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోకచిలుకలు, 23 రకాల పాకే జంతువులు, 21 రకాల కీటకాలున్నట్లు తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు గుర్తించి దీనిని జీవవైవిధ్య వారసత్వ సంపద కలిగిన ప్రదేశంగా ప్రకటించింది.[3] దీంతో వీటిని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువులో టి. హరీశ్ రావు మొక్కలు నాటారు.[4] ఈ చెరువు ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షణలో ఉంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 16 December 2017.
- ↑ ది హిందూ, News, Cities, Hyderabad (19 June 2016). "Ameenpur lake soon to be 'biodiversity heritage site'". Retrieved 16 December 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ (20 June 2016). "ఇక్కడే సెటిలయ్యాం." Retrieved 16 December 2017.[permanent dead link]
- ↑ వన్ ఇండియా, తెలుగు, వార్తలు, తెలంగాణ. "కేంద్రమంత్రి మెచ్చుకున్నారు: హరీష్, తేజ్‌దీప్ చరిత్ర తెలుసుకొని.. (పిక్చర్స్)". telugu.oneindia.com. Retrieved 16 December 2017.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ సాక్షి, ఫోటోలు, వార్తా విశేషాలు (19 September 2015). "అమీనాపూర్ లో 'అరుదైన' అందాలు". Retrieved 16 December 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)