అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా)
అమీనాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°31′57″N 78°19′52″E / 17.532391°N 78.331010°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | అమీన్‌పూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 36,452 |
- పురుషుల సంఖ్య | 18,737 |
- స్త్రీల సంఖ్య | 17,715 |
- గృహాల సంఖ్య | 9,120 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
అమీన్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అమీన్‌పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] అమీన్‌పూర్ పట్టణ శివారు బీరంగూడలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అమీన్‌పూర్ మండలంలోకి చేర్చారు.[3]
భౌగోళికం
[మార్చు]అమీన్‌పూర్ 17°53′23″N 78°33′10″E / 17.88972°N 78.55278°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]వడక్ పల్లి, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డిపేట్, ఐలాపూర్, పటేల్‌గూడ మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 36,452 - పురుషుల సంఖ్య 18,737 - స్త్రీల సంఖ్య 17,715 - గృహాల సంఖ్య 9,120
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని చందానగర్, లింగంపల్లి ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం
- వెంకటేశ్వర దేవాలయం
- షిరిడీ సాయిబాబా దేవాలయం
- సీతారామాంజనేయ దేవాలయం
- శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం
- మస్జిద్-ఇ-ఆయేషా
- అమీనా మసీదు
విద్యాసంస్థలు
[మార్చు]- అమీన్‌పూర్ ప్రభుత్వ పాఠశాల
- ఎంఎన్ ఆర్ కళాశాల
- బెలూహ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- విజన్ వోక్ జూనియర్ కళాశాల
- ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్
- శివలి స్కూల్
- లైఫ్ లైన్ ఇ-టెక్నో స్కూల్
- త్రివేణి టాలెంట్ స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 17 April 2021.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-28 suggested (help) - ↑ "Ameenpur, Miyapur, Hyderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-11-09.