అమీర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమీర్ బాబు / నవాబ్ జాన్
అమీర్ బాబు

2023 ఆగస్టు 4 న బెంగుళూరు నగరంలో జరిగిన కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, IAS (ఐ.ఏ.ఎస్) అధికారి జావెద్ అక్తర్ కుమార్తె వివాహ వేడుక కు హాజరైన అమీర్ బాబు

నియోజకవర్గం కడప నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-01-06) 1960 జనవరి 6 (వయసు 64)
రాయచోటి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మహమ్మద్ హుస్సేన్, తాహెరున్నిసా
జీవిత భాగస్వామి బషీరున్నిసా (1987 - ఇప్పటి వరకు)
సంతానం సోఫియా (కుమార్తె), మహమ్మద్ ఆదిల్, మహమ్మద్ ఫాజిల్ (కుమారులు)
నివాసం కడప
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
మతం ఇస్లాం

వి. ఎస్. అమీర్ బాబు అలియాస్ (వి. ఎస్. నవాబ్ జాన్) భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన ఒక రాజకీయ నాయకుడు.[1].

బాల్యం[మార్చు]

1960 జనవరి 6న ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నగరంలో మహమ్మద్ హుస్సేన్, తాహెరున్నిసా దంపతులకు జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

అతను బి.ఎ చదువుతూ మధ్యలో మానేశారు. తర్వాత రాజకీయాల మీద ఆసక్తి తో చదువుకు స్వస్తి చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసాడు. పార్టీ లో వివిధ పదవులు చేపట్టాడు. 2019 లో కడప శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

నేపధ్యం[మార్చు]

అతను కుటుంబం వ్యాపార నేపధ్యం ఉన్న కుటుంబం. అతని తండ్రి హయాం నుండి రవాణా, పెట్రోలియం, రియల్ ఎస్టేట్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అమీర్ బాబు వివాహం కడపకు చెందిన బషీరున్నిసా తో 1987 లో జరిగింది. ఆ దంపతుల సంతానం ఒక కుమార్తె (సోఫియా), ఇద్దరు కుమారులు (మహమ్మద్ ఆదిల్, మహమ్మద్ ఫాజిల్). కుమారులు ఇద్దరూ వైద్యులుగా స్థిరపడ్డారు. ఆదిల్ రేడియాలజిస్టుగా, ఫాజిల్ గ్యాస్టో ఎంటరాలజిస్టుగా పనిచేస్తున్నారు. కుమార్తె సోఫియా వివాహం కర్నాటక వాస్తవ్యులు, నదీం, ఐపిఎస్ అధికారితో జరిగింది. ఇతని అల్లుడు నదీం ప్రస్తుతం కేరళ రాష్ట్రం లో కాసర్‌గోడ్ జిల్లా పోలీసు ముఖ్య అధికారిగా పనిచేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

2019 లో తెలుగు దేశం పార్టీ తరపున కడప శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడుగా పోటీ చేసి, ప్రత్యర్థి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన అంజాద్ భాషా షేక్ బెపారి చేతిలో పరాజయం చెందాడు.[2].

వార్తలలో అమీర్ బాబు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]