అమీ ఆడు
అమీ ఆడు | |
---|---|
దర్శకత్వం | సోమనాథ్ గుప్తా |
నిర్మాత | న్యూ థియేటర్స్ |
తారాగణం | డెబ్లీనా ఛటర్జీ, సమదర్శి దత్తా, బిదీప్త చక్రవర్తి, రుద్రనీల్ ఘోష్ |
ఛాయాగ్రహణం | సౌమిక్ హల్దార్ |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
నిర్మాణ సంస్థ | న్యూ థియేటర్స్ |
విడుదల తేదీ | 25 ఫిబ్రవరి 2011(కలకత్తా) |
సినిమా నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
అమీ ఆడు, (ఆదుర్ ప్రేమ్), 2011 ఫిబ్రవరి 25న విడుదలైన బెంగాలీ సినిమా. న్యూ థియేటర్స్ నిర్మించిన ఈ సినిమాకు సోమనాథ్ గుప్తా దర్శకత్వం వహించాడు. ముర్షిదాబాద్‌కు చెందిన ఆడు అనే పేద బెంగాలీ పల్లెటూరి అమ్మాయి, 2003 ఇరాక్ దాడి వల్ల తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌కి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.[1][2][3]
గుప్తాకి దర్శకుడిగా ఇది తొలి సినిమా కాగా, టిల్ రోల్ పోషించిన నటి డెబ్లీనా ఛటర్జీ ఈ సినిమాతోనే సినిమారంగంలోకి వచ్చింది. 2010 ఈ సినిమాకు బెంగాలీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.[4]
నటవర్గం
[మార్చు]- డెబ్లీనా ఛటర్జీ (ఆడు)
- సమదర్శి దత్తా (సులేమాన్)
- బిదీప్త చక్రవర్తి
- రుద్రనీల్ ఘోష్ (జబ్బార్)
- ఎనా సాహా (అమీనా)
- మిథు చక్రవర్తి
- ప్రదీప్ ముఖర్జీ
- బిప్లబ్ ఛటర్జీ (మైనుద్దీన్)
- అంగనా బసు
- సౌమిత్ర ఛటర్జీ
- ప్రదీప్ ముఖర్జీ
విడుదల, స్పందన
[మార్చు]2011 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ సినిమాకు 4/5 రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుల రేటింగ్‌లో 3.5/5 రేటింగ్ అందుకుంది. ఆడు పాత్రలో డెబ్లీనా ఛటర్జీ, సులేమాన్‌గా సమదార్ధి దత్తాల నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. డెబ్లీనా ఛటర్జీ ఆడు సినిమా "మనసుకు హత్తుకునేలా" ఉంది అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారి సమీక్షలో రాయబడింది.[1] సౌమిక్ హల్దర్ సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా గ్రామీణ బెంగాల్ షాట్లు, అర్ఘ్యకమల్ మిత్ర ఎడిటింగ్ కూడా ప్రశంసించబడ్డాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ami Aadu". Indian Express. Retrieved 2022-03-09.
- ↑ "Ami Aadu". The Telegraph (Calcutta). Retrieved 2022-03-09.
- ↑ 3.0 3.1 "Ami Aadu review". The Times of India. Retrieved 2022-03-09.
- ↑ "National Film Awards" (PDF). Indian Government. Retrieved 2022-03-09.