అమృతవీణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమృతవీణ పుస్తకం ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయకావ్యాల సంపుటి.

రచన నేపథ్యం[మార్చు]

అమృతవీణ పుస్తకం పలు గేయకావ్యాల సంపుటి. వేర్వేరు సమయాల్లో రచించి, ప్రచురించిన గేయకావ్యాలను మార్చి 2009లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంకలనం చేసి అమృతవీణగా ప్రచురించింది. ఇందులోని గేయకావ్యాలు మొత్తం 6. అవి:

  1. కృష్ణ రజని
  2. కన్నీరు
  3. మహతి
  4. మధు మురళి
  5. గుడి గంటలు
  6. ఋతుఖేల
  7. విరి తూపు

కృష్ణ రజని[మార్చు]

ప్రధాన వ్యాసం: కృష్ణ రజని
కృష్ణశాస్త్రికి మూగతనం వచ్చాకా రాసిన గేయాలను ఈ గేయకావ్యంగా ప్రచురించారు. హైదరాబాద్ లో ఉండగా కృష్ణశాస్త్రి వీటిని రచించారు. కృష్ణశాస్త్రి వీటిని బాలాంత్రపు రజనీకాంత రావు సంగీతం కూర్చగా రచించారు. కృష్ణ రజనీ అనే శీర్షికకు చీకటిరాత్రి అనే కాక, కృష్ణశాస్త్రి సాహిత్యం, రజనీ సంగీతం అనీ అర్థం వస్తుందని గ్రంథకర్త స్వయంగా పేర్కొన్నారు. అయితే అన్ని పాటలూ రజనీతో కూర్చుని రాయడం కుదరలేదు. అమృతవీణ గేయసంకలనంలో వైవిధ్యభరితమైన కవితా వస్తువులతో గేయరచన చేశారు. ఎందుకొరకు ఎవరికెరుక గేయాన్ని ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు రచించిన వెలుగు నీడలు నాటకానికి నేపథ్య గీతంగా రచించారు. ఒక సాయంత్రం హైదరాబాద్ నగరంలో నమాజు విని ఖుదా! నీదే/ అదే పిలుపు! గేయాన్ని రాసుకున్నారు. ఈ గేయాలు సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఇవి ప్రాచుర్యం పొందాయి.

కన్నీరు[మార్చు]

ప్రధాన వ్యాసం: కన్నీరు
1918 - 1923 మధ్య కృష్ణశాస్త్రి బ్రహ్మసమాజం గురించిన విషయాలు వస్తువుగా వ్రాసిన గేయాలివి. 1923లో కన్నీరు గేయసంకలనంగా ప్రచురితమయ్యాయి. బ్రహ్మసమాజంలోని పలు ఉత్సవాలు, ప్రార్థనల్లో ఈ గీతాలను ఉపయోగించేవారు. ఈశ్వరుని కోరుతూ, ఈశ్వరుని ఎడబాటుకు విలపిస్తూ, ఆహ్వానిస్తూ వివిధ వస్తువులతో ఈ గీతాలను రచించారు.[1] జయము జ్ఞానప్రభాకరా గీతాన్ని బ్రహ్మసామజ ఉపాసనలో మంగళ హారతిగా ఉపయోగించేవారు. రండు మన జీవితముల కోరుచున్నది మన బ్రాహ్మధర్మము గీతాన్ని ప్రచార గీతంగా వినియోగించేవారు. బ్రహ్మసమాజంలో కృష్ణశాస్త్రి గేయాలు ఎంతో ఉత్తేజాన్ని నింపేవని ప్రముఖ రచయిత, ఆనాటి బ్రహ్మసమాజ అనూయాయి చలం పేర్కొన్నారు.[2]

మహతి[మార్చు]

ప్రధాన వ్యాసం: మహతి
మహతి మొదట 1949లో గుంటూరు ప్రార్థనా సమాజం ప్రచురించింది. అంతకుముందే 1938లో మహతి నుండి శీర్షికన ఒక గీతావళి రాజమండ్రి ప్రార్థన సమాజం ప్రకటించింది. అవి రెండూ ఇప్పుడు అలభ్య ప్రతులు. మొదట చివర చేర్చిన పద్యావళి కాక, మహతి 67 గీతాల సంపుటం. కన్నీరు కీర్తనలు, మంగళ కాహళిలో చేరిన 5 కీర్తనలు మినహాయించుకుని చూస్తే 42 గీతాలుగా తేలాయి. వేంకట పార్వతీశ్వర కవుల ఉదయ గానము చదివి ప్రతిస్పందనగా లేదోయి నిదురలో లేదోయి సుగతి గీతాన్ని రచించారు,[3] నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ గీతాన్ని చదివిన స్పందించి నేడే రమ్ము! నేడే రమ్ము! వాడిన ఈ సుమము గోయ! గేయాన్ని రచించారు.[4] బసవరాజు అప్పారావు పాట చదివి వాడిన తీగకె గీత రచన చేశారు. ఇటువంటి కవితా వస్తువులే కాక భగవంతుని గురించిన ప్రార్థనా గీతాల వంటివి కూడా ఉన్నాయి.

మధు మురళి[మార్చు]

ప్రధాన వ్యాసం: మధు మురళి

మూలాలు[మార్చు]

  1. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీలు. 19 -35
  2. ఆ రోజుల గురించి చలం:చలం:ధర్మసాధని:15.5.1974
  3. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీ.40
  4. కృష్ణశాస్త్రి సాహిత్యం - 4:కృష్ణశాస్త్రి:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ:పేజీ.49
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతవీణ&oldid=3898892" నుండి వెలికితీశారు