అమృత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత్ కౌర్
జననం(1887-02-02)1887 ఫిబ్రవరి 2
లక్నో, నేటి ఉత్తర్ ప్రదేశ్
మరణం1964 ఫిబ్రవరి 6(1964-02-06) (వయసు 75)
సెయింట్ జాన్ అముబులెన్స్,
కుష్ఠు వ్యాధి నివారణ సంస్థ,
భారతీయ రెడ్ క్రాస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం
Minister of Health
In office
1947 ఆగస్టు 16 – 1957 ఏప్రిల్ 16
ప్రధాన మంత్రిజవాహర్ లాల్ నెహ్రూ
అంతకు ముందు వారుపదవీ స్థాపన'
తరువాత వారుసుశీలా నయ్యర్
వ్యక్తిగత వివరాలు
తల్లిదండ్రులుహర్నాం సింగ్
ప్రిసిల్లా గోలక్‌నాథ్

రాజకుమారి అమృత్ కౌర్ (2 ఫిబ్రవరి 1889 – 6 ఫిబ్రవరి 1964) స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రి. 1947లో బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొందాకా ఏర్పడిని మొట్టమొదటి కేబినెట్ లో ఆమె మంత్రిగా పనిచేశారు. దాదాపు 10ఏళ్ళ పాటు ఆరోగ్య శాఖా మంత్రిగానే కొనసాగారు. ఆమె గాంధీ అనుచరురాలు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అమృత్ కౌర్ సామాజిక ఉద్యమ కార్యకర్తగానూ పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో అమృత్ కౌర్ కూడా ఒకరు. 

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

1889 ఫిబ్రవరి 2న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు అమృత్. పంజాబ్ ప్రాంతంలోని కపుర్తలా రాజ్యానికి చెందిన రాజబంధువు హర్నం సింగ్ కుమార్తె అమృత్.[1] ఏడుగురు అన్నదమ్ములకు ఒకే సోదరి  ఆమె. అమృత్ తల్లి రాణి హర్నం  సింగ్, బెంగాలీ ప్రెస్బిటెరియన్ తల్లి,  ఆంగ్లికన్ తండ్రికి పుట్టినవారు.

ఇంగ్లాండ్లోని డోర్ సెట్ లో షెర్ బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్ లో ప్రాథమిక  విద్య, కళాశాల విద్య ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు.  ఇంగ్లాండ్ లో చదువు పూర్తిచేసుకున్న తరువాత అమృత్ భారతదేశానికి తిరిగి వచ్చారు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో అమృత్ పాత్ర 

[మార్చు]

రాజా హర్నమ్ సింగ్ ఇంటికి గోపాలకృష్ణ గోఖలే వంటి కాంగ్రెస్  నాయకులు వస్తూండేవారు. ఇంగ్లండ్ నుండి దేశానికి వచ్చిన అమృత్ కౌర్ కు భారత స్వాతంత్ర్యోద్యమంపై ఆసక్తి అప్పుడే కలిగింది. 1919లో మహాత్మాగాంధీని బాంబేలో నేరుగా కలుసుకున్న అమృత్ వారి  ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. జలియన్ వాలాబాగ్ దురంతంలో  సిక్కుల ఊచకోత ఆమెను కలచి వేసింది. ఈ దేశానికి బ్రిటీష్ రాజ్  నుండి స్వాతంత్ర్యం రావడం ఎంత అవసరమో అర్ధం చేసుకున్నారు  అమృత్. ఆ సందర్భంలో కాంగ్రెస్ లో చేరిన ఆమె భారత  స్వాతంత్ర్యోద్యమంలోనూ, సాంఘిక సంస్కరణలలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు.

1927లో అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ కు సహ స్థాపకురాలిగా వ్యవహరించారు అమృత్. 1930లో ఆ సంస్థకు కార్యదర్శిగానూ, 1933లో అధ్యక్షురాలిగా పనిచేశారు.

1930లో గాంధీ సారథ్యంలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని దాదాపు 240 మైళ్ళు గాంధీతో కలసి నడిచారు ఆమె. దీనికి ఆగ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం ఆమెను జైలులో బంధించింది.

నోట్స్

[మార్చు]
  1. Tribune India