అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ
Jump to navigation
Jump to search
అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.