అమోల్ కాలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమోల్ కాలే
అధ్యక్షుడు ముంబై క్రికెట్ అసోసియేషన్[1][2]
In office
2022 అక్టోబరు 21 – 2024 జూన్ 10
తిరుమల తిరుపతి దేవస్థానములు సభ్యుడు[3]
In office
2021–2024
వ్యక్తిగత వివరాలు
జాతీయతభారతీయుడు
వృత్తిక్రికెట్ నిర్వాహకుడు

అమోల్ కాలే క్రికెట్ నిర్వాహకుడు, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా.[4][5][6]

కెరీర్

[మార్చు]

అమోల్ కాలే నాగ్‌పూర్‌లో జన్మించాడు. ఆ తరువాత ముంబైకి మారాడు. అక్కడ, ఆయన అనేక రకాల వ్యాపారాలు నిర్వహించాడు. ఆయన కొంతకాలం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ట్రస్టీగా కూడా ఉన్నాడు.

అక్టోబరు 2022లో సందీప్ పాటిల్ తర్వాత అమోల్ కాలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎంసిఎలో అనేక విప్లవాత్మక మార్పులకు ఆయన గుర్తింపు పొందాడు. ఆయన హయాంలో, 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లకు వాంఖెడే స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అలాగే, ముంబై క్రికెట్ జట్టు 2023-24లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.

మరణం

[మార్చు]

2024 టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ చూడటానికి అమోల్ కాలే 2024 జూన్ 9న న్యూయార్క్ చేరుకున్నాడు. మ్యాచ్‌ను వీక్షించిన కొన్ని గంటల తర్వాత 47 ఏళ్ల అమోల్ కాలే గుండె పోటుతో మృతి చెందాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Amol Kale pips ex-Indian cricketer Sandeep Patil to become new Mumbai Cricket Association chief". Times Now (in ఇంగ్లీష్). 2022-10-21. Retrieved 2024-06-10.
  2. "Sandeep Patil loses MCA prez elections to Amol Kale". The Times of India. 2022-10-21. Retrieved 2024-06-10.
  3. "Amol Kale appointed TTD member". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2024-06-10.
  4. "Mumbai Cricket Association president Amol Kale dies of cardiac arrest in New York". The Indian Express (in ఇంగ్లీష్). 2024-06-10. Retrieved 2024-06-10.
  5. "Mumbai Cricket Association president Amol Kale dies of cardiac arrest in New York". India Today (in ఇంగ్లీష్). 2024-06-10. Retrieved 2024-06-10.
  6. "Has CM Devendra Fadnavis recommended Amol Kale for MCA elections?" (in ఇంగ్లీష్). Retrieved 2024-06-10.
  7. "Amol Kale: ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి హఠాన్మరణం | mumbai-cricket-association-president-amol-kale-dies-of-cardiac-arrest-in-usa". web.archive.org. 2024-06-11. Archived from the original on 2024-06-11. Retrieved 2024-06-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)