అరటికాయ సెనగపప్పు వడలు
స్వరూపం
అరటికాయ సెనగపప్పు వడలు అరటికాయ, శనగపప్పులతో చేయబడిన శాకాహారం వంటకం.
కావల్సిన పదార్థాలు
[మార్చు]- అరటికాయలు - రెండు,
- పచ్చిసెనగపప్పు - కప్పు
- అల్లంవెల్లుల్లి ముద్ద - అరచెంచా
- పచ్చిమిర్చి - రెండులేక మూడు
- ఉప్పు - తగినంత
- పసుపు - చిటికెడు
- ధనియాలు - రెండు చెంచాలు
- వేయించిన సెనగపప్పు - నాలుగు చెంచాలు
- దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు కలిపి చేసిన పొడి - అరచెంచా
- నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేయు విధానము:
[మార్చు]- శనగపప్పును నాలుగు గంటల ముందుగా నానబెట్టుకోవాలి.
- అరటికాయల చెక్కు తీసి పెద్ద ముక్కలుగా తరగాలి.
- రిపడా నీటిలో అరటికాయ ముక్కలు, నానబెట్టిన సెనగపప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని ఐదు నిమిషాలు పొయ్యిమీద ఉడికించాలి.
- నీరు వంపేసి మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచుకోవాలి.
- ధనియాలు, వేయించిన వేరుసెనగపప్పును కూడా దోరగా వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి.
- అరటికాయ మిశ్రమంలో ఈ పొడి, దాల్చినచెక్క పొడి కలపాలి.
- బాణలిలో నూనె వేడిచేసి ఈ మిశ్రమాన్ని వడల్లా అద్ది వేయాలి.
- బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
- టమాటా కెచెప్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయివి.