అరవింద్ అడిగా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అరవింద్ అడిగ (ఆంగ్లం: Aravind ; (కన్నడం: ಅರವಿಂದ ಅಡಿಗ) (జననం: 23 అక్టొబర్ 1974) భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాల ద్విపౌరుసత్వం కలిగిన పాత్రికేయుడు మరియు రచయిత. ఇతను రచించిన ది వైట్ టైగర్ (The White Tiger) అను నవల 2008 వ సంవత్సరపు బుకర్ బహుమతిని గెలచింది.

జీవితము[మార్చు]

అరవింద్ ఆడిగ 1974వ సంవత్సరము చెన్నై నగరమున కర్ణాటకకు చెందిన మాధవ ఆడిగ మరియు ఉషా దంపతులకు జన్మించెను. ఇతను మంగళూరు లోని కనరా పాఠశాలయందు మరియు న్యూయార్క్ నగరము లోని కొలంభియా విశ్వవిద్యాలయము లోను చదువుకొనెను. విద్యాభ్యాసం పూర్తిచేసిన పిమ్మట ఇతను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలోను మరియు "టైం" (TIME) పత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

అరవింద్ ఇప్పటివరకు "ది వైట్ టైగర్" మరియు "బిట్వీన్ ది అస్సాసినేషన్స్" (Between the Assassinations) అను రెండు ఆంగ్ల నవలలను రచించాడు. ఇతను బుకర్ బహుమతిని గెలచిన భారతీయులలో మూడవ వ్యక్తి.