అరవింద్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరవింద్ కుమార్
అరవింద్ కుమార్


పదవీ కాలం
13 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
13 అక్టోబర్ 2021 – 12 ఫిబ్రవరి 2023
సూచించిన వారు ఎన్.వి. రమణ
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
26 జూన్ 2009 – 12 అక్టోబర్ 2021
సూచించిన వారు కే. జి. బాలకృష్ణన్
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-14) 1962 జూలై 14 (వయసు 61)

అరవింద్‌ కుమార్‌ (జననం 14 జులై 1962) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన గుజరాత్ హైకోర్టు & కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి, 2023 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అరవింద్ కుమార్ జూలై 14, 1962న కర్ణాటకలో జన్మించాడు. ఆయన బెంగుళూరులోని వివి పురం కళాశాలలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం[మార్చు]

జస్టిస్ అరవింద్ కుమార్ న్యాయవిద్య పూర్తి చేసి 1987లో అడ్వకేట్‌గా నమోదయ్యారు. ఆయన ఆ తరువాత సివిల్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి నాలుగేళ్ల తర్వాత 1991లో కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి అనేక చట్టబద్ధమైన సంస్థలకు సలహాదారుగా, స్టాండింగ్ కౌన్సెల్, కమిటీ సభ్యునిగా పని చేశాడు. అరవింద్ కుమార్ 1999లో కర్ణాటక హైకోర్టులో అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేసి, 2002లో రీజినల్ డైరెక్టు టాక్సెస్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియామకమయ్యాడు. ఆయన ఆ తరువాత 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితుడై, 2009 జూన్ 26న కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి అందుకొని అదే కోర్టులో శాశ్వత జడ్జిగా 2012 డిసెంబర్ 7న నియామకమయ్యాడు. జస్టిస్ అరవింద్ కుమార్ అక్టోబర్ 2021లో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[3]  

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (14 February 2023). "సుప్రీం జడ్జిలుగా ఇద్దరు ప్రమాణం". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
  2. Andhra Jyothy (14 February 2023). "మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం - Mana Telangana". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
  3. The Indian Express (13 October 2021). "Aravind Kumar takes charge as Chief Justice of Gujarat High Court" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.