అరవింద్ కుమార్ గౌడ్
అరవింద్ కుమార్ గౌడ్ పూర్తి పేరు అరవింద్ కుమార్ గౌడ్ ముద్దగోని (జ. 1959, సెప్టెంబర్ 19) భారతీయ రాజకీయ నాయకుడు.[1] అతను తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోని పురానాపూల్ లో జన్మించారు. అయన తండ్రిగారు ప్రతాప్ లింగం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసారు. అరవింద్ కుమార్ గౌడ్ గారికి నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ అరవింద్ గౌడ్ గారికి మేనమామ.
తెలుగుదేశం పార్టీ పెట్టిన అనంతరం 1989లో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకు ముందు నుండే స్వచ్చంద సేవ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. హిందూ ముస్లింల ఐక్యత కోసం చాల కార్యక్రమాలు చేసారు. ఆయన చేసిన సేవలకు 1997లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ చేతుల మీద రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలిట్బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ India, The Hans (2018-03-26). "TDP leaders distribute rice packets". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-16.