అరుంధతి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుంధతి దేవి
జననం(1924-04-29)1924 ఏప్రిల్ 29
బారిసాల్‌, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుతం బంగ్లాదేశ్)
మరణం1990 జనవరి 1(1990-01-01) (వయసు 65) కలకత్తా, పశ్చిమ బెంగాల్
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని[1]
క్రియాశీల సంవత్సరాలు1940-1982
గుర్తించదగిన సేవలు
బిచారక్, జతుగృహ
జీవిత భాగస్వామిప్రభాత్ ముఖోపాధ్యాయ్ (1955)
తపన్ సింహ (1957)
పిల్లలుఅనింద్య సిన్హా

అరుంధతి దేవి, (1924 - 1990) బెంగాలీ సినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని.[2]

జననం[మార్చు]

అరుంధతి బ్రిటీష్ ఇండియాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్) బెంగాల్ ప్రెసిడెన్సీలోని బారిసాల్‌లో జన్మించింది.

విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ఉన్న అరుంధతి, శైలజరంజన్ మజుందార్ వద్ద రబీంద్ర సంగీత్ లో శిక్షణ తీసుకుంది. 1940లో ఆల్ ఇండియా రేడియోలో రవీంద్ర సంగీత గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది.[3]

సినిమారంగం[మార్చు]

కార్తీక్ ఛటోపాధ్యాయ 1952లో తీసిన మహాప్రస్థానేర్ పతే అనే బెంగాలీ సినిమాలో అరుంధతీ దేవి తొలిసారిగా నటించింది. ఈ సినిమా యాత్రిక్ పేరుతో హిందీలో విడుదలయింది.[4] దేవకీ కుమార్ బోస్ తీసిన నబజన్మ (1956), అసిత్ సేన్ తీసిన చలాచల్ (1956), పంచతప (1957), ప్రభాత్ ముఖోపాధ్యాయ్ తీసిన మా (1956), మమత (1957), బిచారక్ (1959), ఆకాశపతల్ (1960), తపన్ సిన్హా తీసిన కలమతి (1958), జిందర్ బోండి (1961), జతుగృహ (1964) మొదలైన సినిమాలలో నటించింది. 1963లో బిజోయ్ బోస్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గెలుచుకున్న బెంగాలీ చిత్రం భాగినీ నివేదిత (1962)లో నటించి ఉత్తమ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్లు అవార్డును అందుకుంది. 1967లో, అరుంధతి తొలిసారి దర్శకత్వం వహించిన చుట్టి సినిమాకు 14వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉన్నత సాహిత్య రచన ఆధారంగా ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

దర్శకుడు ప్రభాత్ ముఖర్జీతో 1955లో అరుంధతి వివాహం జరిగింది. 1957లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా దర్శకుడు తపన్ సిన్హాను కలుసుకున్న అరుంధతి, అతనిని వివాహం చేసుకుంది. వీరి కుమారుడు శాస్త్రవేత్త అనింద్య సిన్హా.

సినిమాలు[మార్చు]

నటిగా
 • 1976: హార్మోనియం
 • 1972: పడి పిషిర్ బార్మి బక్ష (ప్రముఖ దర్శకురాలిగా గుర్తింపు)
 • 1969: మేఘ్-ఓ-రౌద్ర (దర్శకురాలిగా కూడా)
 • 1964: జతుగృహ (మాధురి)
 • 1962: షియులిబారి
 • 1962: భగినీ నివేదిత (నివేదిత)
 • 1961: జిందర్ బోండి
 • 1960: ఖుదిత పాషన్
 • 1960: ఇంద్రధనుడు
 • 1960: ఆకాష్-పటాల్
 • 1959: బిచారక్ (నిర్మాతగా)
 • 1959: శశి బాబర్ సన్సార్
 • 1959: పుష్పధనుడు
 • 1958: మన్మోయీ బాలికల పాఠశాల (నిహారిక)
 • 1956: చలాచల్
 • 1956: నాబజన్మ
 • 1955: దశ్యుమోహన్ (చాప అలియాస్ మిస్ సంధ్యా రే)
 • 1955: డు-జనయ్
 • 1955: గోధూళి
 • 1954: మిలీగా చెలీ కార్
 • 1954: నాడ్-ఓ-నాడి
 • 1952: మహాప్రస్థానేర్ పాఠే రాణిగా
 • 1952: యాత్రిక్ (రాణి)
దర్శకురాలిగా
 • 1985: గోకుల్
 • 1983: దీపర్ ప్రేమ్
 • 1972: పడి పిషిర్ బార్మి బక్ష
 • 1969: మేఘ్ ఓ రౌద్ర[5]
 • 1967: చుటీ (స్క్రిప్ట్ రైటర్, మ్యూజిక్ కంపోజర్ కూడా)

మరణం[మార్చు]

అరుంధతి 1990, జనవరి 1న మరణించింది. [6]

మూలాలు[మార్చు]

 1. "Arundhati Devi - Bengali women filmmakers who have made India proud". The Times of India. Archived from the original on 5 January 2020. Retrieved 2022-03-12.
 2. "Arundhati Devi movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-09-19. Retrieved 2022-03-12.
 3. "অন্তরের অন্দরে রয়ে গেল গান". anandabazar.com. Archived from the original on 9 November 2019. Retrieved 2022-03-12.
 4. "স্ম র ণ : অরুন্ধতী দেবী". শেয়ার বিজ. Archived from the original on 6 February 2017. Retrieved 2022-03-12.
 5. "সুরকার অরুন্ধতী". anandabazar.com. Archived from the original on 16 November 2019. Retrieved 2022-03-12.
 6. Arundhati Devi in Upperstall Archived 9 సెప్టెంబరు 2011 at the Wayback Machine

బయటి లింకులు[మార్చు]