అరుణ్ కుమార్ చందా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2000 లో విడుదల చేసిన భారతదేశపు స్టాంప్‌పై అరుణ్ కుమార్ చందా

అరుణ్ కుమార్ చందా (1899-1947), అస్సాం రాష్ట్రం, కచార్ జిల్లాకు చెందిన భారత స్వాతంత్ర్య సమర యోధుడు. [1] Archived 2016-03-03 at the Wayback Machine అతను సామాజిక కార్యకర్త, రచయిత. బెంగాలీ వారపత్రిక సప్తక్‌కు సంపాదకుడు. 1960 లో అతని జ్ఞాపకార్థం సిల్చార్‌లో AK చందా లా కాలేజి పేరుతో న్యాయ కళాశాలను స్థాపించారు. [1] భారత ప్రభుత్వం అతని గౌరవార్థం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది.

అరుణ్ కుమార్ చందా, అస్సాం లోని టీ కార్మికుల నాయకుడిగా వారి ప్రగతికి కృషి చేసాడు. 1939 లో కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులను టీ ఎస్టేటుల్లో ప్రచారానికి అనుమతించలేదు. అరుణ్ చందా, డెర్బీ అనే టీ ఎస్టేటుకు బయటే నిలబడి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించాడు. అతని ప్రసంగానికి ముగ్ధులైన కార్మికులు అరుణ్ రాజా కీ జయ్ అని నినదించారు. [2] ఆ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థే నెగ్గాడు.

మూలాలు[మార్చు]

 

  1. Gyandarshan Edusolutions Private Limited (2017-04-25). "The law college in Silchar offers legal education through its three-year under graduate program." Educational Portal India (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-08-18. Retrieved 2019-08-18.
  2. Socio-economic and Political Problems of Tea Garden Workers: A Study of Assam (in ఇంగ్లీష్). Mittal Publications. 2006-01-01. p. 158. ISBN 978-81-8324-098-7.