అరుషి నిషాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుషి నిషాంక్
జననం (1986-09-17) 1986 సెప్టెంబరు 17 (వయసు 38)
కోట్‌ద్వార్, ఉత్తరాఖండ్, భారతదేశం
జాతీయతభారతీయులు
వృత్తి
  • శాస్త్రీయ నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అభినవ్ పంత్
(m. 2015)

అరుషి నిషాంక్ (జననం 1986 సెప్టెంబరు 17) భారతీయ కథక్ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, పారిశ్రామికవేత్త, కవయిత్రి.[1] ఆమె బిర్జు మహరాజ్, డాక్టర్ పూర్ణిమా పాండేల శిష్యురాలు. ఆమె భారతీయ కౌన్సిల్ లో సాంస్కృతిక సంబంధాల శాఖలో కథక్ కళాకారిణి. ఆమె ప్రసార భారతిలో భాగమైన దూరదర్శన్‌ లో కూడా నాట్య ప్రదర్శనలు ఇస్తుంది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఉత్తరాఖండ్లోని కొట్ద్వార్ లో జన్మించింది అరుషి. రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్ లో రాజకీయ శాస్త్రం, తత్త్వ శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేసింది.

గంగా దేవత భూమికి వస్తున్న కథ "గంగా అవతారణ్",[2] సుఫియానా క్లాసికల్ కథక్ డాన్స్ "సజ్దా"[3][4] వంటి కంపోజిషన్లను ఆమె స్వరపరిచింది. ఆమె 2017 లో ప్రైడ్ ఆఫ్ ఉత్తరాఖండ్ పురస్కారాన్ని,[5] 2018 లో ఉత్తరాఖండ్ గౌరవ్ సమ్మన్ పురస్కారాన్ని అందుకుంది.[6][7] ఆమె తన తండ్రి రమేష్ పోఖ్రియాల్ రాసిన నవల ఆధారంగా "మేజర్ నిరాలా" అనే ప్రాంతీయ చిత్రాన్ని నిర్మించింది. ఆమెకు పర్యావరణ, సామాజిక సమస్యలపై ఆసక్తి ఉంది.[8][9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2019 లో భారత కేబినెట్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా నియమితులైన రమేష్ పోఖ్రియాల్, కుసుం కాంతా పోఖ్రియాల్ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె తండ్రి గతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆమె 2015 జనవరి 24 న అభినవ్ పంత్ ను వివాహం చేసుకుంది.[10]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-21. Retrieved 2020-01-08.
  2. "The Dance of Mother Ganga: Pujya Swamiji and Dignitaries, Including Shri Anna Hazare, come together to enjoy an unforgettable performance". Gangaaction.org. Archived from the original on 18 మే 2017. Retrieved 7 July 2017.
  3. "Archived copy". Archived from the original on 27 ఏప్రిల్ 2015. Retrieved 11 జూన్ 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "नृत्यांगना आरूषि निशंक की शानदार जुगलबंदी : स्वतंत्र आवाज़ डॉट कॉम". Swatantraawaz.com. 16 April 2013. Archived from the original on 28 మార్చి 2017. Retrieved 7 July 2017.
  5. "Himani Shivpuri, Dobhal get Pride of Uttarakhand award". Tribuneindia.com. 1 December 2016. Retrieved 7 July 2017.
  6. "आरुषि को मिला उतराखंड गौरव सम्मान". Amar Ujala. Archived from the original on 27 ఆగస్టు 2019. Retrieved 17 March 2020.
  7. "आरुषि निशंक को उत्तराखंड गौरव सम्मान". 22 July 2018. Archived from the original on 27 ఆగస్టు 2019. Retrieved 17 March 2020.
  8. Kuriakose, Simi (30 October 2019). "'Women should lend a helping hand to each other'". India Today (in ఇంగ్లీష్). Retrieved 27 March 2020.
  9. "भारत की एनवायरमेंट एक्टिविस्ट आरुषि निशंक को शिकागो में मिला 'टॉप 20 ग्लोबल वूमेन अवॉर्ड'". Amar Ujala. 3 March 2020. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  10. "V-DAY : निशंक की बेटी ने की मां की आखिरी इच्‍छा पूरी, सहेली के बेटे से शादी". News18 India. 1 January 1970. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.