అర్మేనియన్ స్మశానవాటిక (హైదరాబాదు)
అర్మేనియన్ స్మశానవాటిక (ఉప్పుగూడ అర్మేనియన్ స్మశానవాటిక), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పుగూడలో ఉన్న స్మశానవాటిక. కుతుబ్ షాహీ కాలానికి చెందిన ఈ స్మశానవాటిక, మూడు వందల సంవత్సరాల పూర్వం ఏర్పాటుచేయబడింది.[1]
స్మశానవాటిక
[మార్చు]ఇక్కడ అర్మేనియన్ స్మశానాలు, చర్చియార్డ్ ఉన్నాయి. ఈ స్మశానవాటికలో మొత్తం 19మంది అర్మేనియన్లను ఖననం చేశారు. వారిలో రెవ్ జోహన్నెస్ (1680), రెవ్ సైమన్ (1724) అనే ఇద్దరు పూజారులు కూడా ఉన్నారు. హైదరాబాదు నగరంతో అర్మేనియన్లకు ఉన్న సంబంధానికి ఇదే చివరి గుర్తు.[2]
హైదరాబాదులో అర్మేనియన్ స్థావరం కూడా ఉంది. హైదరాబాద్‌లోని అర్మేనియన్ సమాజం హోలీ ఎట్చ్మియాడ్జిన్ నుండి పోంటిఫికల్ బుల్‌ను అందుకుంది. హైదరాబాదులో నివసిస్తున్న డచ్, ఆంగ్లేయులకు ప్రత్యేకమైన స్మశానవాటిక లేకపోవడంతో ఈ స్మశానవాటికను పంచుకున్నారు.[3]
పరిరక్షణ
[మార్చు]భారత పురావస్తు ప్రదేశాల స్మారక చిహ్నం, చట్టం (1960) ప్రకారం ఈ శ్మశానవాటికను పురావస్తు శాఖ పరిరక్షిస్తోంది. నివాసితుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది దాదాపుగా క్షీణదశలో ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 28 May 2018. Retrieved 22 February 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Armenian cemetery in dire straits". The Hindu. 28 March 2012. Retrieved 22 February 2021.
- ↑ "High on hobbies: A society chronicles history in its own way". The Times of India. 1 May 2012. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 22 February 2021.
- ↑ "In India, Historic Armenian Cemetery Buried Under Waste". Asbarez. 17 April 2009. Retrieved 22 February 2021.