Jump to content

అలర్మెల్ వల్లి

వికీపీడియా నుండి
అలర్మెల్ వల్లి
జననం (1956-09-14) 1956 సెప్టెంబరు 14 (వయసు 68)
జాతీయతభారతీయులు
వృత్తిక్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్య నృత్యకారిణి
జీవిత భాగస్వామిBhaskar Ghosh
వెబ్‌సైటుOfficial website

అలర్మెల్ వల్లి (తమిళం: அலர்மேல் வள்ளி) (జననం 1956 సెప్టెంబరు 14) భారతీయ నృత్యకారులు, కొరియోగ్రాఫర్. ఆమె భరతనాట్యంలో సుప్రసిద్ధురాలు.[1][2] ఆమె 1984లో చెన్నైలో స్థాపింపబడిన "దీపశిక్ష" సంస్థకు వ్యవస్థాపకులు. ఆ సంస్థలో ఆమె భరతనాట్యంపై శిక్షణ ఇస్తుంటారు.[3]

1991 లో అలర్మెల్ వల్లి వైజయంతమాల తరువాత భారత రాష్ట్రపతిచే పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ పిన్నవయస్కురాలిగా వినుతికెక్కింది. ఆమె 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.[4] 2004 లో ఆమె భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు అందుకుంది.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

అరమెన్ వల్లి చెన్నైలో పెరిగింది. అచట సాక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్, చర్చ్ పార్క్, చెన్నైలో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె పందనల్లుర్ చొక్కలింగం పిళ్ళై, ఆయన కుమారుడు పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై పర్యవేక్షణలో పందనల్లూర్ శైలిలో భరతనాట్యాన్ని అభ్యసించింది. ఆమె పదాలు మరియ్ జావళీలను వీణా ధనమ్మాళ్ శైలిలో సంగీతకారిణి టి.ముక్త వద్ద కొన్ని సంవత్సరాలు అభ్యసించింది.[6]

వృత్తి

[మార్చు]

ఆమె మద్రాసులోని ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 9 1/2 సంవత్సరాల వయస్సులో రంగస్థల ప్రవేశం చేసింది. ఆమెకు నాట్య కాలా భూషణ్ అవార్డు లభించింది. పారిస్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక "సారా బెర్న్‌హార్డ్ థెట్రే డి లా విల్లే" అంతర్జాతీయ నృత్య ఉత్సవంలో ఆమె కేవలం 16 ఏళ్ళ వయసులో పాల్గొని అంతర్జాతీయంగా న పురస్కారాలను గెలుచుకుంది. తరువాత ఆమె దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలనిచ్చింది.[7][8][9] శాస్త్రీయ తమిళ సాహిత్యం, 2000 సంవత్సరాల సంగం కవిత్వం సంకలనాలపై ఆమె చేసిన పరిశోధనల ఫలితంగా నృత్య కవితలప్రదర్శన మొదలయింది. సంవత్సరాలుగా ఆమె శాస్త్రీయ భరతనాట్యం రంగంలో తనదైన శైలిని అభివృద్ధి చేసుకుంది.[10]

ఆమె విద్యార్థులలో రగమల డాన్స్ కంపెనీకి చెందిన రానీ రామస్వామి, అపర్ణ రామ్‌స్వామి ఉన్నారు. అదే విధంగా మిన్నియాపాలిస్, మీనాక్షి శ్రీనివాసన్ లు కూడా శిష్యులుగా ఉన్నారు.

జూలై 2015 లో, సాల్జ్‌బర్గ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ఆమె.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె భాస్కర్ ఘోష్ ను వివాహమాడారు. ఆయన ఐ.ఎ.ఎస్ అధికారి.[11]

పద్మశ్రీ పురస్కారం

అవార్డులు , సత్కారాలు

[మార్చు]
  • 1969: ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటే నుండి "నాట్యకళాభూషణం? బిరుదు.
  • 1973: సుర్ సింగర్ సమ్మేళన్,ముంబై నుండి "సింగర్ మణి".
  • 1975: కళానికేతన్,మద్రాసు వారినుండి "నృత్యజ్యోతి"
  • 1976: చిదంబరం దేవస్థానం నుండి భారత కళా తత్వప్రకాశిని.
  • 1979: తమిళనాడు ప్రభుత్వ "కళామమణి" అవార్డు.
  • 1980: సుర్ సింగర్, బాంబే వారి నుండి నృత్య వికాస్.
  • 1985: మద్రాసులోని కృష్ణగానసభ నుండి నృత్య చూడామణి.
  • 1990: యు.ఎస్.ఎ లోని న్యూజెర్రీకి చెందిన తమిళనాడు ఫౌండేషన్ నుండి అడల్ అరసి.
  • 1991: పద్మశ్రీ
  • 1996: చండీఘర్ లోణి ప్రాచీన కేంద్రం నుండి నృత్య ఊర్వశి.
  • 1997: పారిస్ నగరం చే గ్రాండ్ మెడల్.
  • 2002: సంగీత నాటక అకాడమీ అవార్డు [4]
  • 2003: చెన్నైలో లలిత కళా వేదిక ట్రస్టు చే సత్కారం.
  • 2003: కోయంబత్తూరు లోని నృత్య విద్యా భవన్ కేంద్రం వారి నుండి నృత్య రత్న.
  • 2004: పద్మభూషణ పురస్కారం
  • 2004: ఫ్రెంచ్ ప్రభుత్వం చే "చెవాలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్" అవార్డు [2][12]
  • 2008: చెన్నై లోని పద్మ సారంగపాణి కల్చరల్ అకాడమీ వారిచే పద్మ సాధన.
  • 2009: శ్రీ గురు అవార్డు.

యివి కూడా చూడండి

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sparkling show of style: There was never a dull moment in Alarmel Valli's performance". The Hindu. January 7, 2009. Archived from the original on 2011-06-04. Retrieved 2014-03-23.
  2. 2.0 2.1 "The best of music and dance". Express Buzz. 9 Jan 2010. Archived from the original on 18 మే 2012. Retrieved 8 జనవరి 2020.
  3. "Transcending barriers: Alarmel Valli on the language of dance". Indian Express. October 2, 2008.
  4. 4.0 4.1 Sangeet Natak Akademi Award:Bharat Natyam Archived 2011-07-27 at the Wayback Machine Sangeet Natak Akademi official website.
  5. "Padma Bhushan Awardees". Ministry of Communications and Information Technology. Archived from the original on 5 జూన్ 2009. Retrieved 2009-06-28.
  6. Alarmel Valli Biography[permanent dead link] Govt. of Kerala.
  7. "Art is where the heart is ..." The Hindu. 18 September 2009.
  8. "Natural and poetic". The Hindu. 6 January 2010.
  9. Jack Anderson (23 June 1991). "Review/Dance; Indian View of Humanity And Divinity". The New York Times.
  10. Alarmel Valli Biography[permanent dead link], keralawomen.gov.in; accessed 13 May 2017.
  11. "Hindi theatre is in a sad mess". The Hindu. Archived from the original on 7 సెప్టెంబరు 2012. Retrieved 18 February 2012.
  12. "`Dancing takes me places'". The Hindu. Apr 13, 2004. Archived from the original on 2010-06-10. Retrieved 2014-03-23.