అలెక్సాండ్రా కొల్లొంటాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలెక్సాండ్రా కొల్లొంటాయ్
Aleksandra Kollontai.jpg
అలెక్సాండ్రా కొల్లొంటాయ్
జననం
అలెక్సాండ్రా మిఖాయిలొవ్న డొమొంతొవిచ్

31 మార్చి 1872
మరణం1952 మార్చి 9(1952-03-09) (వయసు 79)
జాతీయతరష్యణ్
వృత్తిరచయిత్రి, విప్లవవాది, దౌత్యవేత్త
జీవిత భాగస్వామివ్లాదిమిర్ లుద్విగొవిచ్ కొల్లొంటాయ్
పావెల్ డిబెంకొ
పిల్లలుమిఖాయిల్ కొల్లొంటాయ్
సంతకం
Aleksandra Kollontai signature.png

అలెక్సాండ్రా మిఖాయిలోవ్నా కొల్లొంటాయ్ (Alexandra Mikhailovna Kollontai, Алекса́ндра Миха́йловна Коллонта́й — పుట్టింటి పేరు దొమొంతొవిచ్, Домонто́вич) (March 31 [O.S. March 19] 1872 - మార్చి 9, 1952) రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు, దౌత్యవేత్త. తొలుత మెన్షెవిక్‍గానూ, 1914 నుండి బోల్షవిక్ గానూ పనిచేసింది. 1923 నుండి సోవియట్ దౌత్యవేత్తగా పనిచేసిన ఈమె 1926లో మెక్సికోకు సోవియట్ సమాఖ్య దౌత్యవేత్తగా నియమించబడింది. తొట్టతొలి మహిళా రాయబారుల్లో ఈమె ఒకర్తె.[1]

కొల్లొంటాయ్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించింది. ఈమె తండ్రి మిఖాయిల్ దొమొంతొవిచ్, 1877-78లో జరిగిన రష్యా - టర్కీ యుద్ధంలో జనరల్ గానూ. 1878-79లో బల్గేరియాలోని రష్యా ప్రభుత్వం యొక్క ప్రధాన ఛాన్సలర్ గా పనిచేశాడు. ఈమె తల్లి అలెగ్జాండ్రా మసలిన్-మ్రావిన్స్కీ, ఫిన్నిష్ సంతతికి చెందిన ఒక ధనిక కలప వ్యాపారి కూతురు.

కొల్లొంటాయ్ స్త్రీవాదం[మార్చు]

అలెక్సాండ్రా కొల్లొంటాయ్ స్త్రీవాదం వివాదాస్పద అంశంగా మారింది. అలెక్సాండ్రా కొల్లొంటాయ్ ప్రతిపాదించిన ఫ్రీ లవ్ సిద్ధాంతం ప్రకారం స్త్రీకి అనేక మంది పురుషులతో సంబంధాలు ఉండొచ్చు. ఈ సిద్ధాంతాన్ని లెనిన్ వ్యతిరేకించాడు. అనేక మంది పురుషులతో పడుకోవడం అనేది పంది లాగ బురదలో దొరలడం లాంటిదని లెనిన్ ఒక రహస్య సమావేశంలో కొల్లొంటాయ్ తో వాదించాడు. ఈ రహస్య సమావేశం గురించి లెనిన్ క్లారా జెట్కిన్ అనే జెర్మన్ కమ్యూనిస్ట్ నాయకురాలికి ఉత్తరం వ్రాసాడు. ఆ సమావేశంలో కొల్లొంటాయి అన్న మాటలు గురించి చెప్పాడు. సెక్స్ స్వేచ్ఛ అనేది గ్లాసెడు మంచి నీళ్ళు తాగినంత అప్రధాన విషయంగా ఉండాలని కూడా కొల్లొంటాయ్ వాదించింది. మురికి గ్లాస్ లో నీళ్ళు తాగడం ఏమిటని లెనిన్ అడిగాడు. గ్లాసెడు మంచి నీళ్ళ సిధ్ధాంతం స్త్రీవాదానికి వ్యతిరేకమైనదని లెనిన్ అన్నాడు. ఈ సిధ్ధాంతం కార్మిక వర్గం కోరుకునేది కాదని, బూర్జువా వర్గం కోరుకునేదని కూడా లెనిన్ అన్నాడు.[2]

మూలాలు[మార్చు]