Jump to content

అలోక్ శర్మ

వికీపీడియా నుండి
అలోక్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు ప్రగ్యా ఠాకూర్
నియోజకవర్గం భోపాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-11-25) 1967 నవంబరు 25 (వయసు 57)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గౌరీ శంకర్ శర్మ, విద్యా శర్మ
జీవిత భాగస్వామి శ్రద్ధా శర్మ
సంతానం 2 కుమారులు
నివాసం భోపాల్
పూర్వ విద్యార్థి భోపాల్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

అలోక్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అలోక్ శర్మ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ నుండి వచ్చి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా, 1997లో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కన్వీనర్‌గా, ఆ తరువాత 2015 లో కార్పొరేటర్‌గా ఎన్నికై 2015 నుండి 2020 వరకు భోపాల్‌ మేయర్‌గా పని చేశాడు.[3] ఆయన ఆ తరువాత 2023లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నార్త్ భోపాల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అతిఫ్ ఆరిఫ్ అకీల్ చేతిలో ఓడిపోయాడు.

అలోక్ శర్మ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ శ్రీవాస్తవపై 5,01,499 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (14 April 2024). "Bhopal Lok Sabha constituency: A fierce battle on cards between BJP's Alok Sharma and Congress's Arun Shrivastav" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.
  2. The Times of India (6 June 2024). "Record Win For Alok Sharma in Bhopal". Archived from the original on 6 June 2024. Retrieved 2 October 2024.
  3. India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  4. "2024 Loksabha Elections Results - Bhopal". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  5. TV9 Bharatvarsh (5 June 2024). "भोपाल लोकसभा सीट से जीतने वाले BJP के आलोक शर्मा कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)