అల్దీ రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్దీ రామకృష్ణ బాలసాహిత్య రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన చిత్తూరు జిల్లా కలికిరి గ్రామంలో 1949వ సంవత్సరం నవంబరు 13న శ్రీమతి రెడ్డమ్మ, శ్రీహుళక్కి దంపతులకు జన్మించాడు. బి.ఎస్సీ, బి.యిడి చదివి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. బి.ఏ., బి.ఎడ్‌., చదివి ఉపాధ్యాయవృత్తి చేపట్టి పదవీ విరమణ పొందారు. అల్దీ రామకృష్ణ రచనలు అన్ని ప్రముఖ పత్రి కల్లోనూ ప్రచురించబడ్డాయి. బుజ్జాయి బాలల మాసపత్రికలో వినాయకుడి కథలు 20 ధారా వాహికంగా ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి విక్లీ, ‘బాలభూమి’ శీర్షికలో పదివారాల పాటు తెనాలి రామకృష్ణుడి కథలు 2006లో పదివా రాల పాటు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. బాలమిత్ర, చిన్నారి పత్రికలలో కొన్ని జానపదకథలు రాశారు. ఇంకా పిల్లల కోసం పాటలు, గేయకథలు అనేకం రాశారు.అల్దీ రామకృష్ణ బాలల కోసం రాసిన రూపకాలు అనేకం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి పలు మార్లు ప్రసారమయ్యాయి. తిరుపతి అకాశ వాణి కేంద్రం ప్రోగ్రాం హెడ్‌ ఎ.మల్లేశ్వరావు ప్రత్యేకంగా అల్దీ రామ కృష్ణ గారిచే రేడియో ప్రసారం కోసం ‘కుమ్మరి భీమన్న’, ‘శరణం అయ్య ప్ప’ వంటి నాటకాలు కోరి రాయించుకున్నారు.[2]

రచనలు[మార్చు]

  1. వినాయకుడి కథలు
  2. హరిహరసుత శతకము
  3. కురువరతి నంబి అను కుమ్మరి భీమన్న (నాటకం)
  4. దైవదర్శనం-ధర్మసందేహాలు
  5. కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ కథ
  6. శ్రీ షిరిడీ సాయిబాబా గాథలు, సూక్తులు

మూలాలు[మార్చు]

  1. "పిల్లల కథలు అమ్మ భాషలో ఉండాలి". సూర్య దినపత్రిక. 2008. Retrieved 13 August 2015.[permanent dead link]
  2. పిల్లల కథలు అమ్మ భాషలో ఉండాలి[permanent dead link]