అల వైకుంఠపురంబులో నగరిలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల వైకుంఠపురంబులో నగరిలో
కవి పేరుబమ్మెర పోతన
మూల గ్రంథంఆంధ్రమహా భాగవతం
విభాగంగజేంద్రమోక్షం
అధ్యాయంఅష్టమ స్కందము
దేశంభారతదేశం
భాషతెలుగు
విషయము(లు)గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ని వర్ణించే సన్నివేశం
ఛందస్సుమత్తేభవిక్రీడితము
సినిమాలలో వాడుకభక్త పోతన

అల వైకుంఠపురంబులో నగరిలో అనేది బమ్మెర పోతన రచించిన తెలుగు భాగవతంలోని పద్యం. ఈ సన్నివేశం గజేంద్ర మోక్షము లోనిది.[1] ఇది మత్తేభవిక్రీడితము పద్యం.[2]

నేపధ్యం

[మార్చు]

ఈ పద్యం గజేంద్రమోక్షం అనే ఘట్టంలో కనిపిస్తుంది. గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంటంలో ఉన్న విష్ణుమూర్తిని వర్ణించాలి .. అసలు వైకుంటంలో విష్ణుమూర్తి ఎలా ఉండి ఉంటాడు . అక్కడ ఏమి ఉంటాయి. ఎలా వర్ణించాలి అని పోతన గారు ఎంతగా ఆలోచిస్తున్న తనకి ఏమి తట్టడం లేదు. పోతన గారు వాళ్ళ అమ్మాయితో నేను గుడివరకు వెళ్లి వస్తాను అని చెప్పారంట. ఆయన వచ్చేలోపే సాక్షాత్తు వైకుంఠవాసి అయిన మహావిష్ణువే వచ్చి పద్యాన్ని పూర్తీ చేసి వెళ్ళాడు అని చెబుతారు.[3]

పూర్తి పద్యం

[మార్చు]

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

ప్రతిపదార్థం

[మార్చు]

అల = అక్కడ
వైకుంఠ = వైకుంఠ మనెడి
పురంబు = పట్టణం
లోన్ = అందు
నగరి = రాజ భవన సముదాయము
లోన్ = అందు
ఆ = ఆ
మూల = ప్రధాన
సౌధంబు = మేడ {సౌధము – సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}
దాపల = దగ్గర
మందార = మందార పూల
వన = తోట
అంతర = లోపల
అమృత = అమృత జలపు
సరస్ = సరోవరము
ప్రాంత = సమీపమున గల
ఇందుకాంత = చంద్రకాంత శిల
ఉప = పైన
ఉత్పల = కలువల
పర్యంక = పాన్పుపై నున్న
రమా = లక్ష్మీదేవితో
వినోది = వినోదించు చున్న వాడు
అగున్ = అయిన
ఆపన్న = కష్టాలలో నున్న వారిని
ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు
విహ్వల = విహ్వలము చెంది నట్టి (విహ్వలము – భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట)
నాగేంద్రము = గజేంద్రుడు
పాహి పాహి = కాపాడు కాపాడు
అనన్ = అను
కుయ్యాలించి = మొర ఆలించి
సంరంభి = వేగిరపడు తున్న వాడు
ఐ = అయ్యి.

తాత్పర్యం

[మార్చు]

అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం ( మేడ). ఆమేడ పరిసరాల్లో మందార వనం, అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము ( మంచం) పై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడునికి ఏనుగు ‘పాహీ! పాహీ! ( రక్షించు,రక్షించు) అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం.[4]

తెలుగు సినిమా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "విష్ణువు ఆగమనము : అష్టమ స్కంధము : గ్రంథము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2019-12-28. Retrieved 2020-01-18.
  2. మిరియాల), Dileep Miriyala(దిలీపు. "మత్తేభవిక్రీడితము — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2014-08-22. Retrieved 2020-01-18.
  3. "మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – Page 3 – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-02-15. Retrieved 2020-01-18.
  4. "Sujanaranjani Monthly Telugu E-Magazine". www.siliconandhra.org. Archived from the original on 2019-12-25. Retrieved 2020-01-18.
  5. https://indiancine.ma/DMO/info[permanent dead link]
  6. "'అల వైకుంఠపురంలో'.. ఏముంది ? - Telugu 360". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-01-18.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]