అశ్వ సామర్థ్యం
Jump to navigation
Jump to search
అశ్వసామర్థ్యం లేదా హార్స్‌పవర్ (Horsepower, hp) అనేది సామర్థ్యం యొక్క ఒక కొలత ప్రమాణం. హార్స్‌పవర్ లలో అనేక వివిధ ప్రమాణాలు, రకాలు ఉన్నాయి. నేడు ఉపయోగంలో రెండు సాధారణ నిర్వచనాలు ఉన్నాయి: మెకానికల్ హార్స్పవర్ (లేదా ఇంపీరియల్ హార్స్పవర్), ఇది సుమారు 745.7 వాట్స్;, మెట్రిక్ హార్స్పవర్, ఇది సుమారు 735.5 వాట్స్.
ఈ "హార్స్ పవర్" పదమును దుక్కి గుఱ్ఱముల యొక్క సామర్థ్యముతో ఆవిరి యంత్రాల యొక్క అవుట్పుట్ సరిపోల్చడానికి స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్ 18 వ శతాబ్దంలో అవలంబించాడు. ఈ హార్స్‌పవర్ పదం తరువాత పిస్టన్ ఇంజన్ల యొక్క ఇతర రకాల పవర్ అవుట్పుట్ సహా టర్బైన్లు, విద్యుత్ మోటార్లు వంటి, ఇతర యంత్రాల యొక్క అవుట్పుట్ సామర్థ్యాన్ని సూచించుటకు విస్తరించబడింది.[1][2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Horsepower", Encyclopedia Britannica Online. Retrieved 2012-06-24.
- ↑ "International System of Units" (SI), Encyclopedia Britannica Online. Retrieved 2012-06-24.