అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)
చెన్నైలోని అష్టలక్ష్మి దేవాలయం
చెన్నైలోని అష్టలక్ష్మి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:చెన్నై జిల్లా
ప్రదేశం:చెన్నై
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ వాస్తుశిల్పం
అష్టలక్ష్మి దేవాలయం

అష్టలక్ష్మి దేవాలయం అనేది తమిళనాడు రాష్ట్రం, చెన్నైలోని ఇలియట్స్ బీచ్ సమీపంలో తీరప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ దేవాలయం లక్ష్మీ దేవతకి అంకితం చేయబడింది. భక్తులు అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించే విధంగా బహుళ-స్థాయి కాంప్లెక్స్‌పై గర్భగుడి నిర్మించబడింది.[1][2]

నిర్మాణం[మార్చు]

కంచి మఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కోరిక మేరకు ఈ దేవాలయం నిర్మించబడింది.[1] 1974 జనవరిలో ప్రజల భాగస్వామ్యంతో దేవాలయ పునాది పడింది. 1976 ఏప్రిల్ 5న అహోబిల మఠానికి చెందిన 44వ గురువు వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికన్ స్వామి సమక్షంలో దేవాలయ సంప్రోక్షణ జరిగింది.

దేవాలయం[మార్చు]

65 అడుగుల పొడవు, 45 అడుగులు వెడల్పుతో ఉతిరమేరూర్‌లోని సుందర వరదరాజ పెరుమాళ్ దేవాలయం తరహాలో ఈ దేవాలయం నిర్మించబడింది.

ఈ దేవాలయంలో లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలోని అష్టలక్ష్మిలు, తొమ్మిది వేర్వేరు గర్భాలలో నాలుగు స్థాయిలలో కొలువై ఉన్నారు. లక్ష్మి, ఆమె భర్త విష్ణువు మందిరం రెండవ స్థాయిలో ఉంది. ఇక్కడ పూజలు ప్రారంభించిన భక్తులు మెట్లు ఎక్కి మూడవ అంతస్తుకు వెలుతారు. అక్కడ సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా కొన్ని మెట్లు ఎక్కి వెళితే నాల్గవ అంతస్తులో ఉన్న ఏకైక మందిరంలో ధనలక్ష్మి విగ్రహం ఉంటుంది. ఆ మందిరం నుండి బయటికి వస్తే మొదటి స్థాయిలో ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధార్యలక్ష్మి మందిరాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో దశావతారాలు (విష్ణువు అవతారాలు), గురువాయూరప్పన్, గణేశుడు, ధన్వంతరి, ఆంజనేయ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.

పునర్నిర్మాణం[మార్చు]

2012లో ఈ దేవాలయాన్ని 7 మిలియన్లతో పునరుద్ధరించారు. మరో 1.6 మిలియన్లతో జీర్ణోత్తరణ అష్టబంధన మహాకుంభాభిషేకం, హిందూ వేడుకను నిర్వహించారు. గర్భగుడిపై బంగారు పూత పూసిన 5.5 అడుగుల ఎత్తైన కలశంతో సహా మొత్తం 32 కలశాలను దేవాలయంలో అమర్చారు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Astakalshmi temple". Indian heritage.com. March 2012. Retrieved 2023-02-14.
  2. 2.0 2.1 "Ashtalakshmi temple consecrated in Chennai". Deccan Chronicle. Chennai. 2 June 2012. Retrieved 2023-02-14.

బయటి లింకులు[మార్చు]