Jump to content

అష్ట సోమేశ్వర క్షేత్రాలు

వికీపీడియా నుండి
(అష్ట సోమేశ్వరములు నుండి దారిమార్పు చెందింది)

ద్రాక్షారామమునకు అష్టదిక్కులా ప్రతిష్ఠింపబడ్డ శివలింగాలను అష్ట సోమేశ్వరాలు లేదా అష్టలింగాలుగా వ్యవహరిస్తారు.

వ్యుత్పత్తీ, భాషావిశేషాలు

[మార్చు]

'అష్ట' అనగా ఎనిమిది. సోముడు అనగా చంద్రుడు. ఈశ్వరుడు అనగా శివుడు. చంద్రునిచే ప్రతిష్ఠింపబడ్డ లింగములను సోమేశ్వరములుగా పిలిచెదరు—సోమా+ఈశ్వరములు=సోమేశ్వరములు- గుణ సంధి.

పురాణం

[మార్చు]

పూర్వము సూర్యభగవానునిచే ద్రాక్షారామములో శివలింగము ప్రతిష్ఠించబడింది. దీని వలన ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత పెరగసాగింది. ఈ ఉష్ణోగ్రతను అదుపు చేసేందుకు, చంద్రభగవానుడు, ద్రాక్షారామమునకు అష్టదిక్కులనా శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఇవే అష్ట సోమేశ్వరాలు.

ప్రదేశాలు

[మార్చు]

తూర్పున కోలంక, పడమర వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలో దంగేరు, నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యాన పెనుమాళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి.

అష్ట సోమేశ్వరాలనూ, నవలింగాలనూ, వాటి స్థానాలనూ చూపిస్తూ, వాటి ప్రతిష్ఠాపనం వెనుక ఉన్న వృత్తాంతాన్ని వివరిస్తున్న ఫలకం. సోమేశ్వరంనందు శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉంది.

నమ్మకాలు

[మార్చు]

అష్టసోమేశ్వరములతో ద్రాక్షారామమును కలిపి నవలింగాలని పిలిచెదరు. ఈ తొమ్మిదింటినీ ఒకే దినమున దర్శించిన, పుణ్యఫలము కలుగునని నమ్మకము.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

అష్ట సోమేశ్వరములు (ఫలకం). సోమేశ్వరమునందు శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో. Retrieved 27 December 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]