అష్ట సోమేశ్వర క్షేత్రాలు
This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. |
ద్రాక్షారామమునకు అష్టదిక్కులా ప్రతిష్ఠింపబడ్డ శివలింగాలను అష్ట సోమేశ్వరాలు లేదా అష్టలింగాలుగా వ్యవహరిస్తారు.
వ్యుత్పత్తీ, భాషావిశేషాలు
[మార్చు]'అష్ట' అనగా ఎనిమిది. సోముడు అనగా చంద్రుడు. ఈశ్వరుడు అనగా శివుడు. చంద్రునిచే ప్రతిష్ఠింపబడ్డ లింగములను సోమేశ్వరములుగా పిలిచెదరు—సోమా+ఈశ్వరములు=సోమేశ్వరములు- గుణ సంధి.
పురాణం
[మార్చు]పూర్వము సూర్యభగవానునిచే ద్రాక్షారామములో శివలింగము ప్రతిష్ఠించబడింది. దీని వలన ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత పెరగసాగింది. ఈ ఉష్ణోగ్రతను అదుపు చేసేందుకు, చంద్రభగవానుడు, ద్రాక్షారామమునకు అష్టదిక్కులనా శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఇవే అష్ట సోమేశ్వరాలు.
ప్రదేశాలు
[మార్చు]తూర్పున కోలంక, పడమర వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలో దంగేరు, నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యాన పెనుమాళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి.
నమ్మకాలు
[మార్చు]అష్టసోమేశ్వరములతో ద్రాక్షారామమును కలిపి నవలింగాలని పిలిచెదరు. ఈ తొమ్మిదింటినీ ఒకే దినమున దర్శించిన, పుణ్యఫలము కలుగునని నమ్మకము.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]అష్ట సోమేశ్వరములు (ఫలకం). సోమేశ్వరమునందు శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో. Retrieved 27 December 2022.