అష్రాఫ్ ఫయీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్రాఫ్ ఫయీద్ (అరబ్బీ: اشرف فياض‎, * 1980 సౌదీ అరేబియాలో) చిత్రకారుడు, రచయిత. ఆయన పాలస్తీనాకు చెందినవాడు. కానీ సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గాజా ప్రాంతానికి చెందిన పాలస్తీనా శరణార్థుల దంపతులకు జన్మించాడు. సౌదీ అరేబియా దక్షిణాది పట్నం ఆబాలాలో పెరిగాడు. ఆయన కవి, చిత్రకారుడు. ఆయన యూరోప్, సౌదీ అరేబియాలలో అనేక చిత్ర ప్రదర్శనలను నిర్వహించాడు. ఆయన బ్రిటిష్-అరేబియన్ ఆర్ట్ ఆర్గనైజేషన్ "ఎడ్జ్ ఆఫ్ అరేబియా"లో క్రియాశీలకంగా ఉన్నాడు.[2] నవంబరు 2015 న ఆయనకు మత భ్రష్టత్వ మరణశిక్ష విధించబడింది.[3]

తన కవితల్లోనూ, సంభాషణలల్లోనూ మతాన్ని వదిలిపట్టమన్నాడని ఆష్రాఫ్ పై ఆరోపణలొచ్చాయి. 2014 జనవరి నుంచీ జైల్లో ఉన్నాడు. ఆయనపై ఆరోపణలేవీ ఋజువు కాకుండానే కోర్టువారు నాలుగేళ్ళు ఖైదు, 800 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2014 మే నెలలో ఈ శిక్ష ఖరారయింది. ఒక హోటల్ లో వాదనల మధ్య తాను ఇలా మాట్లాడినట్లు ఒక వ్యక్తి ఆరోపణలు నిరాధారమని ఫయీద్ అప్పీలు చేసాడు. దాన్ని డిస్మిస్ చేసిన కోర్టు 2015 లో తిరిగి విచారణ జరిపి అతని తల నరికి చంపాలని కొత్త జడ్జీల పానెల్ తీర్పు నిచ్చింది. ఈ వార్త విన్న ఆయన తండ్రి గుండె ఆగి మరణించాడు. అంత్యక్రియలకు కూడా ఫయీద్ ను అనుమతించలేదు[4][5]. ఆయన 2008 లో ఒక కవితా సంకలనం "ఇన్‌స్ట్రక్షన్స్ విథిన్"ను నాస్తికత్వం గూర్చి వ్రాసాడు.

అతనికి విధించిన శిరచ్చేదం శిక్షను రద్దు చేయాలని అమెరికా అక్ష్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ ఆమెరూన్ లకూ, జర్మనీ విదేశాంగ శాఖకూ ప్రపంచంలోని 350 రచయితల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై రచయితలు ఒర్హాన్ పాముక్ (టర్కీ), మారియో వరోస్ లోసా (పెరూ) కూడా సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు కూడా ఈ శిక్షను ఖండిచారు. ఇది కళా స్వేఛ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకూ ఘోరమైన ఉల్లంఘన అన్నారు. 44 దేశాలలో 122 సభల్లో 2016 జనవరి 13న ఫయీద్ కవితా సంకలనం "ఇన్‌స్ట్రక్షన్స్ వితిన్" లోని కవితల పఠనం ఉద్యమంలా సాగింది[6]. బెర్లిన్ అంతర్జాతీయ సాహిత్య ఉద్యమ వేదిక ఈ కార్యక్రమం జరిపింది.[2][5][7]

మూలాలు[మార్చు]

  1. Stoughton, India (28 March 2014). "Putting contemporary Saudi art in context". The Daily Star. Retrieved 27 December 2015.
  2. 2.0 2.1 Batty, David (20 November 2015). "Saudi court sentences poet to death for renouncing Islam". The Guardian. Retrieved 21 November 2015.
  3. Ben Hubbard (22 November 2015). "Saudi Artist's Death Sentence Follows a String of Harsh Punishments". The New York Times. Retrieved 23 November 2015.
  4. Angus McDowall (November 20, 2015). "Saudi Arabian court sentences Palestinian poet Ashraf Fayadh to death for apostasy". The Independent.
  5. 5.0 5.1 McDowall, Angus; Evans, Dominic (20 November 2015). "Saudi court sentences Palestinian poet to death for apostasy: HRW". Reuters. Riyadh. Retrieved 21 November 2015.
  6. Worldwide Reading of selected poems and other texts in support of Ashraf Fayadh
  7. [వార్త దినపత్రిక, ఆంధ్ర ప్రదేశ్, పాలస్తీనా కవికి సౌదీలో శిరచ్ఛెద శిక్ష, పుట 4]

వెబ్ లింకులు[మార్చు]