Jump to content

అసుర నాగరికత

వికీపీడియా నుండి

ముక్కామల నాగభూషణం "అసుర నాగరికత" గ్రంథాన్ని రచించారు, కృష్ణాజిల్లా రచయితలసంఘం 1992 లో దీన్ని ప్రచురించింది. "పురోగమనం" పేరుతో గుత్తికొండ సుబ్బారావు ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాశారు.

సింధు నాగరికత చరిత్ర, ఆ నాగరికతను నిర్మించిన ప్రజల చరిత్ర, ఆ నాగరకత వర్ధిల్లిన కాలం మొదలయిన సమస్యలను ఇందులో రచయిత చర్చించారు.

క్రీస్తు పూర్వం మూడువేల ఏళ్ళ క్రితం ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో ప్రవేశించినపుడు స్థానికులు వారిని ఆగంతకులు అనే అర్థంలో 'ఆరి' అని సంబోధించారని, ఆర్యులకు, స్థానికులకు ఘర్షణలు మొదలయిన తర్వాత ఆరి అనే పదం శత్రువు, పన్ను, చక్రం వంటి అర్థాలు సంతరించుకొని, పాణిని కాలానికి అరి అంటే వైశ్యుడు, ఆర్య అంటే పండితుడు, బ్రాహ్మణుడు అనే అర్థాలు సంతరించుకొన్నట్లు వివరించాడు. ఆరి శబ్దమే క్రమంగా ఆర్యగా పరిణమించిందని మరికొందరు భావిస్తారు.

ఆర్యానా నుండి సప్త సింధు ప్రాతంలో స్థిరపడిన వారికి "ఆర్యనులు" అనే నామం కలిగి, క్రమంగా ఆర్యులుగా పరిణమించింది.

వైదిక వాగ్మయంలో కనిపించే వ్యవసాయ సంబంధ పదాలు ఆర్యేతరులవే. లాంగల, నాగలి, కూడడాల-పలుగు, ఖల=కళ్ళం , శూర్ప-చేట; ఉతాఖల- రోలు, పల్లి- చిన్న గ్రామం వంటి పదాలన్నీ ఆర్యేతరులవని ప్రొఫెసర్ రొమిలా థాపర్ అన్నారు. స్థానికులనుంచి ఆర్యులు వ్యవసాయం నేర్చుకొన్నారు.

వేదానికీ, అవెస్థాకూ సంబధం ఉందిగానీ, వేదానికీ, పురాణాలకూ సంబంధంలేదు. ఋగ్వేద ఆర్యుల చరిత్ర అరియానా (ఇరాన్)తో ప్రారంభమవుతుంది.

ఋగ్వేద ఆర్యులు విగ్రహారాధకులు కారు. వేదకాలంలో ఆలయాల నిర్మాణం జరగలేదు. బౌద్ద మతస్తుల స్థూప నిర్మాణానికి పోటీగా ఆలయ నిర్మాణం ఆరంభమయిందని, రచయిత సింధునాగరికత ఆర్యలది కాదని అనేక దృష్టాంతాలతో వాదించారు.

ఆనాటి ఆర్యులు పశుల కాపరులు. వ్యవసాయదారులు కారు. గొర్రెలు, ఉన్నిబట్టలు గురించిన మాటలు ఋగ్వేదంలో ఉన్నాయి. తొలుత వారికి నూలు బట్టలతో పరిచయం లేదు.

ఆనాటి తవ్వకాలలో రామాయణ, భారత గాథలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. సింధూ నాగరకత ఔన్నత్యంలో ఉన్న సమయంలో కురు, పాండవుల ప్రదేశాలు, ఆర్యుల ఔన్నత్యానికి కారణమయిన ప్రదేశాలు కీకారణ్యాలుగా ఉన్నాయి. సింధూనాగరకత ఆర్యులది కాదనేవిషయం స్పస్టం.

ఆర్యుడయిన దివోదాసుకు శంబకాసురినికి జరిగిన యుద్ధాలలో అసురుల పురాలు ధ్వంసం అయ్యాయి. దివోదాసు పురాలను స్వాధీనం చేసుకోలేదు, నాశనం చేశాడు.

చెంగిజ్ఖాన్, వగయిరా విదేశీలు పశుపాలకులు, తార్తారులు, మంగోలులు ఆసియా, యూరపు ఖండాలలో పట్టణాలను నేలమట్టంచేశారు.

ఆర్యేతరుల నాగరికతను స్వీకరించిన ఆర్యులు వృద్ధిలోకి వచ్చారు. పశుసంపద మీద జీవించిన ఋగ్వేద ఆర్యులు వ్యవసాయంలోకి మారారు. పశువుల మేతకు వ్యవసాయం తప్పనిసరి అయింది.

హరప్పా నాగరికత అభివృద్ధి చెందడానికి పూర్వమే హలం వాడుకలోకి వచ్చింది, వ్యవసాయానికి సంబంధమయిన అనేక అనార్య భాషల పదాలు సంస్కృతంలోకి వచ్చాయి. స్థానికులనుంచి ఆర్యులు వ్యవసాయ పద్ధతులను నేర్చుకొన్నారు. వేదం ఇరాన్ లో మొదలయింది కనుకనే అవెస్తాతో పోలికలు కనిపిస్తాయి. 3.5 వేల సంవత్సరాల క్రితమే భారత ఉపఖండంలోకి ఆర్యులు ప్రవేశించినట్లు, సింధునాగరికత ఆర్యులది కాదని డాక్టర్ పి. సి. కశ్యప్, డాక్టర్ శంకాలియా, బి. బి. లాల్ రాశారు.

రుగ్వేదార్యులు విగ్రహారాధకులు కారు. సంస్కృతీకరణ, చరిత్రను వక్రీకరించడం వల్ల ఇటువంటి అభిప్రాయాలు ప్రచారంలోకి వచ్చాయి.

ద్రావిడ శబ్దం సంస్కృత, తమిళ వాజ్మయాలలో కనిపించదు.

ఋగ్వేదార్యులు దానవ, రాక్షసాదులతో పోరాడినట్లు ఉందిగాని ద్రావిడులతో పొరాడినట్లు లేదు.

ద్రావిడులు సంకీర్ణ జాతివారని మను స్మృతి, తదితర స్మృతులలో చెప్పబడినట్లు పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి మహాభారత చరిత్రలో రాశారు. ఆంధ్ర మహా భారతంలో చెప్పబడిన 56 జనపదాల్లో ద్రవిళ జనపదం ఉంది. ద్రు -గతౌ -ధాతువును అనుసరించి తరుమబడినవారు -పరశురామునికి భయపడి పారిపోయిన క్షత్రియులే ద్రావిడులని భారతంలో ఉంది.

ఆంధ్రులు తుషార జాతితో పాటుగా -ఆక్సస్ నదీతీరాలలో నివసించినట్లు వాయుపురాణం చెబుతోంది. అర్మీనియన్ భాషలో ఆంధ్రావిన్ అంటే అగ్రజుఅడు అని అర్థం. ఇతర ఆర్యుల వలెనే ఆంధ్రులు కూడా మధ్య ఆసియా నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. అశోకుని శాసనాలలో "ఆంధ్ర పులిందేషు" అని ఉంది.

మెగస్తనీసు ఆంధ్రుల ఔన్నత్యాన్ని ప్రశంసించాడు. ఆంధ్రులకు, తమిళులకు సింధునాగరికతతో సంబంధంలేదు.

రచయత ఇండస్ లిపిమీద చర్చ చేశారు. గుణాఢ్యుని బృహత్కథను నేపాలి పండితుడు బుద్ధస్వామి 11524 శ్లోకాలలో సంస్కృతంలోకి అనువాదం చేశాడు. సోమదేవసూరి బృహత్కథను కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు.

రచయిత పైశాచి భాష మూలాలను గూర్చి చర్చించాడు.

బ్రాహుయికి ద్రావిడ భాషలతో సంబంధం గూర్చి సుదీర్ఘంగా చర్చించి సంబధం ఉందని అంటాడు. డాక్టర్ రావు సింధుభాష ఆర్య భాష అన్నారని, తాను సింధు నాగరికత ప్రజల భాష PROTO DRAVIDIAN అంటాడు.

ఆర్య, ద్రావిడులు ఈదేశంలోకి ఎక్కడనుంచి వచ్చిఉంటారు? Trimmile తెగవారు Asiaminor నుంచి మనదేశంలోకి వచ్చి ఉంటారని, వీరు యురల్ అల్తాయిక్ తెగకు చెందినవారయి ఉంటారని, యురల్ పర్వత ప్రాంత వాసులని రకరకాల అభిప్రాయలున్నట్లు వివరించాడు.

రుగ్వేద ఆర్యులు ఎక్కడనుంచి, ఏమార్గంలో భారత దేశంలోకి ప్రవేశించి ఉంటారు? రకరకాల అభిప్రాయాలు రచయిత వివరించారు. హరప్పా లిపి చిత్రలిపి కావచ్చన్నారు. లోథాల్ లో లభించిన ఒక కుండమీద చెట్టుమీద కాకినోట్లో మాంసం ముక్క, చెట్టుకింద నక్క చిత్రం ఉంది. బహుశా ఇది పంచతంత్రం కథ కావచ్చని అంటారు. ఋగ్వేదంలో లిపి ప్రస్తావన ఉన్నట్లు రచయిత అంటారు.

ఋగ్వేదంలో కనిపించే పంచజన శబ్దములు, సప్తసింధు ప్రదేశంలో అక్కడక్కడ నివసించిన యదు, తుర్వశ, అను, ద్రుహ్యూ, పూరువు లనే ఆర్య గణాలను సూచిస్తున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. శంబరాసురుని 100 పురాలనూ దివోదాసు ఇంద్రునికి వశపరచినట్లు రుగ్వేదం. సింధునాగరికత ఆర్యులది కాదు, అది అసురులదని రచయిత ఈ గ్రంథంలో నిరూపిస్తారు. భరతులే కౌరవ పాండవ వంశాలకు మూల పురుషులు, వారే ఈ దేశానికి బారతదేశం అని పేరు రావడానికి కారణం. క్రీస్తు పూర్వం 3500 రాతి ఆయుధాలతో, కంచు ఆయుధాలతో ఆర్యులు ఈ దేశంలోకి ప్రవేశించారు. రెండో దశలో వచ్చిన ఆర్య గణాలలో ఆంధ్రులు కూడా ఉన్నారు. పురాణగాధల, అవతార గాధల పొరల వెనక చరిత్ర మరుగున పడిపోయిందని రచయిత వ్యాఖ్యానించారు.

హరప్పా దానవ సంస్కృతికి, దక్షిణభాగం మహోంజదారో రాక్షససంస్కృతికి దగ్గరగా వున్నాయి. రెండు భాగాలవారూ పశుపతిని ఆరాధించారు అని బి,ఎన్. రాయ్ అభిప్రాయపడ్డారు.

బహరీన్ దీవి పుణ్యజన రాక్షసుల అధీనంలో ఉండేది. ద్వారక ప్రాంత వ్యాపారం పైవారి చేతుల్లో ఉండేది. పుణ్యజన రాక్షసులకు సింధునాగరికతతో సంబధం ఉన్నట్లు రచయిత భావించారు.

మూలాలు

[మార్చు]