అహిషోర్ సాల్మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహిషోర్‌ సాల్మన్‌
జననం (1979-03-18) 1979 మార్చి 18 (వయసు 45)
జాతీయతభారతీయుడు
వృత్తిసినీ రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం

అహిషోర్‌ సాల్మన్‌ భారతదేశానికి చెందిన సినీ రచయిత, దర్శకుడు. ఆయన కర్నూలులో బి.కామ్ పూర్తి చేసిన అనంతరం, పూణే లోని ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్ అండ్ మీడియా నుండి మాస్ కమ్యూనికేషన్ కోర్స్ పూర్తి చేశాడు.

సినీ ప్రస్థానం

[మార్చు]

అహిషోర్‌ సాల్మన్‌ హిందీ చిత్రాలు 'పాప్', 'రోగ్' లకు సహాయ దర్శకుడుగా పనిచేశాడు. 'డర్నా జరూరీ హై' చిత్రానికి ముఖ్య సహాయ దర్శకుడుగా పనిచేశాడు. అహిషోర్‌ సాల్మన్‌ 2013లో "జాన్ డే" హిందీ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.[1] ఆయన 2016లో తెలుగులో వచ్చిన ‘ఊపిరి’ చిత్రానికి సహ రచయితగా, 2019 లో వచ్చిన "మహర్షి" సినిమాకు రచయితగా పనిచేశాడు. నాగార్జున హీరోగా 2021లో వచ్చిన ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[2][3][4]

పని చేసిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం భాష
2003 పాప్ సహాయ దర్శకుడు హిందీ
2005 రోగ్ సహాయ దర్శకుడు హిందీ
2006 డర్నా జరూరీ హై ముఖ్య సహాయ దర్శకుడు హిందీ
2013 జాన్ డే దర్శకుడు హిందీ
2016 ఊపిరి సహ‌ రచయిత తెలుగు
2019 మహర్షి కథా రచయిత తెలుగు
2021 వైల్డ్ డాగ్ దర్శకుడు తెలుగు

మూలాలు

[మార్చు]
  1. DNA India (13 September 2013). "Film Review: 'John Day' is a muddled affair". Archived from the original on 11 జనవరి 2017. Retrieved 26 April 2021.
  2. Namasthe Telangana (24 March 2021). "ప్రయోగాత్మక సినిమా కాదు". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  3. Sakshi (25 March 2021). "డైరెక్టర్‌కి ఆ రెండూ తెలియాలి". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  4. Eenadu (24 March 2021). "'వైల్డ్‌డాగ్‌'కు కారణం ఓ చిన్నవార్త: సాల్మన్". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.