ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్
పర్యాయపదాలుబెచ్టెరెవ్ సిండ్రోమ్; బెఖ్టెరెవ్ వ్యాధి; బెచ్టెరెవ్స్ వ్యాధి; మోర్బస్ బెచ్టెరెవ్; బెఖ్టెరెవ్-స్ట్రూమ్పెల్-మేరీ వ్యాధి; మేరీస్ వ్యాధి, మేరీ-స్ట్రూమ్పెల్ ఆర్థరైటిస్; పియరీ-మేరీస్ వ్యాధి
6వ శతాబ్దపు అస్థిపంజరం ఫ్యూజ్డ్ వెన్నుపూస, తీవ్రమైన ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్‌కు సంకేతం
ప్రత్యేకతరుమాటాలజీ
లక్షణాలుబిగుసుకు పోయిన కీళ్లు, వెన్ను నొప్పి
సాధారణ ఆరంభంయువతలో
వ్యవధిదీర్ఘ కాలం
కారణాలుకారణాలు తెలియరాలేదు. పర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు,రక్త పరీక్షలు, మెడికల్ ఇమేజింగ్ పరీక్షలు
చికిత్సమందులు, వ్యాయామం, అవసరమైతే శస్త్ర చికిత్స
ఔషధ ప్రయోగంస్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, వ్యాధిని సవరించే యాంటీ రుమాటిక్ డ్రగ్ (DMARDs)
రోగ నిరూపణసాధారణ జీవిత కాలం
తరచుదనం0.1 to 1.8%

ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ( AS ) అనేది ఒక రకమైన కీళ్లవాతం (ఆర్థరైటిస్), ఈ వ్యాధిగ్రస్తులకు వెన్నెముక కీళ్లలో దీర్ఘకాలిక మంట (inflammation) ఉంటుంది. దీనివలన సాధారణంగా వెన్నెముక, పొత్తికడుపు (పెల్విస్) తో కలిసిన చోట కీళ్ళు కూడా ప్రభావితమవుతాయి. అప్పుడప్పుడు భుజాలు లేదా తుంటి వంటి ఇతర కీళ్ళు కూడా దీని వలన ప్రభావితమవుతాయి. కంటికి, ప్రేగులో కూడా సమస్యలు ఉత్పన్నమవవచ్చు. వెన్నునొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణం. ఇది తరచుగా వస్తూంటుంది పోతూంటుంది.[1] ప్రభావితమైన కీళ్లు బిగుసుకు పోయే పరిస్థితి కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. [1] [2]

కారణాలు

[మార్చు]

ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు కారణం తెలియనప్పటికీ, ఇది జన్యు పర్యావరణ కారకాల మిశ్రమం అని భావిస్తారు .[1] యునైటెడ్ కింగ్ డం లో ఈ వ్యాధివలన ప్రభావితమైన వారిలో 90% కంటే ఎక్కువ మందిలో HLA -B27 (హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్‌) అనే యాంటిజెన్ ఉంది. [3] అయితే దీని అంతర్లీన యంత్రాంగం ఆటో ఇమ్యూన్ లేదా ఆటోఇన్‌ఫ్లమేటరీ అని భావిస్తారు. [4]

రోగ నిర్ధారణ

[మార్చు]

రోగ నిర్ధారణ సాధారణంగా మెడికల్ ఇమేజింగ్, రక్త పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. AS అనేది ఒక రకమైన సెరోనెగేటివ్ స్పాండిలో ఆర్థ్రోపతి, అంటే పరీక్షల ఫలితాలు రుమటాయిడ్ ఫ్యాక్టర్ (RF) యాంటీబాడీస్ ని, ఉనికిని చూపించవు.[1] ఇది యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అనే విస్తృత వర్గంలో ఉంది. [5]

చికిత్స

[మార్చు]

ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు చికిత్స లేదు. చికిత్సలు కొంతవరకు శరీర పరిస్థితిని మెరుగుపరుస్తాయి, రోగ లక్షణాలను తీవ్రతరం కాకుండా నిరోధింస్థాయి. ఇందులో మందులు, వ్యాయామం, అవసరమైతే శస్త్రచికిత్స ఉండవచ్చు. మందులలో NSAIDలు, స్టెరాయిడ్స్, సల్ఫసలాజైన్ వంటి DMARDలు, TNF ఇన్హిబిటర్స్ వంటి జీవసంబంధ ఏజెంట్లు ఉన్నాయి.[1]

వ్యాప్తి

[మార్చు]

సాధారణంగా ప్రజలలో 0.1% - 1.8% మంది ప్రభావితమయినట్లు తెలుస్తోంది. [6] యువకులలో ఈ వ్యాధి మొదలవుతుంటుంది. ఆడవారి కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు. [1] బెర్నార్డ్ కానర్ ఈ వ్యాధి గురించి 1600ల చివరలో వివరించాడు, అయితే ఈజిప్షియన్ మమ్మీలలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌తో కూడిన అస్థిపంజరాలు కనిపిస్తాయి. [7] ఈ పదం గ్రీకు నుండి వచ్చిన 'ఆంకిలోస్' అంటే ఏకం లేదా కలిసి పెరగడం అని అర్ధం, 'స్పాండిలోస్' అంటే 'వెన్నుపూస', '-టిస్' అంటే వాపు. [1]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Questions and Answers about Ankylosing Spondylitis". NIAMS. June 2016. Archived from the original on 28 September 2016. Retrieved 28 September 2016.
  2. "Ankylosing spondylitis". GARD. 9 February 2015. Archived from the original on 2 October 2016. Retrieved 28 September 2016.
  3. (January 2004). "The ramifications of HLA-B27".
  4. (January 2015). "Update on ankylosing spondylitis: current concepts in pathogenesis".
  5. (October 2014). "The concept of axial spondyloarthritis: joint statement of the spondyloarthritis research and treatment network and the Assessment of SpondyloArthritis international Society in response to the US Food and Drug Administration's comments and concerns".
  6. Khan, Muhammad Asim (2009). Ankylosing Spondylitis (in ఇంగ్లీష్). Oxford University Press. p. 15. ISBN 9780195368079. Archived from the original on 8 సెప్టెంబరు 2017.
  7. Boos, Norbert; Aebi, Max (2008). Spinal Disorders: Fundamentals of Diagnosis and Treatment (in ఇంగ్లీష్). Springer Science & Business Media. p. 25. ISBN 9783540690917. Archived from the original on 8 సెప్టెంబరు 2017.