Jump to content

ఆంగోత్ తుకారాం

వికీపీడియా నుండి
ఆంగోత్ తుకారాం
వ్యక్తిగత సమాచారం
జననం21 డిసెంబర్ 1998
తక్కళ్లపల్లి తండా, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.
జాతీయత భారతదేశం
వృత్తి జీవితం
ప్రారంభ వయస్సు18 (2 జూన్‌ 2016)
గుర్తించదగిన ఆధిరోహణలుకిలిమంజారో మంచు పర్వతం (2018),
స్టాక్‌కాంగ్రీ పర్వతం (2017),
మౌంట్ ఎవరెస్ట్ (2019)
చివరి అధిరోహణమౌంట్ కొస్కిస్జ్కో (2020)
కుటుంబం
జీవిత భాగస్వామిమానస నాయక్
తల్లిదండ్రులుఅంగోత్‌ రాందాసు, జంకుల

ఆంగోత్ తుకారాం పవార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు. ఆయన 2019లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాడు.[1] తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఆంగోత్ తుకారాం తెలంగాణ రాష్ట్రం , రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, తక్కళ్లపల్లి తండాలో అంగోత్‌ రాందాసు, జంకుల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ లోని నోబెల్ డిగ్రీ కళాశాల నుండి బిఏ (పొలిటికల్ సైన్స్) పూర్తి చేశాడు.

పర్వతారోహణ జీవితం

[మార్చు]

ఆంగోత్ తుకారాం సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ రెండో బెటాలియన్‌లో క్యాడెట్‌గా చేసి, 2015లో ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందాడు.

  1. 2016 జూన్‌ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతా న్ని ఎక్కి తెలంగాణ జెండాను ఎగురేసి, బతుకమ్మ ఆడి రాష్ట్ర ఖ్యాతిని చాటాడు.
  2. 2017 జూన్‌ 2న ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతాన్ని అధిరోహించిన అనంతరం ఖాదీ వస్త్రాలను ధరించాలని ప్రజలకు సందేశాన్ని ఇచ్చాడు.
  3. 2017 జూలై 15న హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతాన్ని అధిరోహించిన అనంతరం 19 ఫీట్ల భారత జాతీయ జెండాను ఎగురవేశాడు.
  4. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించాడు.పర్వతాన్ని అధిరోహించిన అనంతరం వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రజలకు సందేశాన్ని ఇచ్చాడు.[2]
  5. 2019 మే 2019లో మౌంట్‌ ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించాడు.[3][4]మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన అనంతరం అంగోత్‌ తుకారాంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.[5]
  6. 10 మార్చ్ 2020లో ఆస్ట్రేలియాలోని మౌంట్ కొస్కిస్జ్కో అధిరోహించి శాంతి సందేశమిచ్చాడు.[6][7]

అవార్డ్స్

[మార్చు]

ఆంగోత్ తుకారాం 2018లో ఉత్తమ క్రీడాకారుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నాడు.[8] ఆయన ఇలా పలు మంచు పర్వతాలు అధిరోహించినందుకుగాను లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్, ఇండియన్ రికార్డ్స్, హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు.[9]అంగోత్‌ తుకారాం సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో ‘జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌’ (క్రీడలు – పురుషుల) అవార్డును తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నాడు.[10]సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న అనంతరం అంగోత్‌ తుకారాం విజయాల గురించి తెలుసుకొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతనికి ప్రోత్సహకంగా రూ. 35 లక్షల చెక్కును ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో అతనికి అందజేశాడు.[11][12]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (13 July 2019). "Stories of courage" (in Indian English). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  2. Edex Live (12 October 2019). "Why 21-year-old Amgoth Tukaram braved hunger and extreme weather to scale Mt Everest to save nature" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  3. Sakshi (26 May 2019). "'ఎవరెస్టు'ను అధిరోహించిన గిరిజన తేజం". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  4. NDTV (14 July 2018). "Telangana Teen Scales Mt Kilimanjaro, Has A Special Message". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  5. ETV Bharat News (3 February 2021). "తెలంగాణ: తుకారాంకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందన". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  6. The New Indian Express (12 March 2020). "Telangana youngster scales Australia's highest peak Mount Kosciuszko". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  7. The Hindu (11 March 2020). "Hyderabad boy scales highest Oz peak" (in Indian English). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  8. TV9 Telugu (4 June 2019). "ఎవరెస్ట్ యోధుడికి గ్రాండ్ వెల్‌కమ్!". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. The Live Mirror (14 July 2018). "Indian Teenagers scale Mount Kilimanjaro to create awareness". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  10. Sakshi (25 September 2021). "Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు 'సాక్షి'". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  11. V6 Velugu (25 September 2021). "తెలంగాణ మౌంటెనీర్ కు జగన్ 35 లక్షల సాయం" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. Sakshi (27 September 2021). "తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్‌ భారీ ఆర్థిక సహాయం". Sakshi. Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.