ఆంథోనీ ఫిరింగీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంథోనీ ఫిరింగీ
దర్శకత్వంసునీల్ బెనర్జీ
రచనసునీల్ బెనర్జీ
నిర్మాతబి.ఎన్. రాయ్
తారాగణంఉత్తమ్ కుమార్
తనుజ
ఛాయాగ్రహణంబిజోయ్ ఘోష్
కూర్పుఅర్ధెందు ఛటర్జీ
సంగీతంఅనిల్ బాగ్చి
నిర్మాణ
సంస్థ
బి.ఎన్. రే ప్రొడక్షన్స్
విడుదల తేదీ
6 అక్టోబరు 1967
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

ఆంథోనీ ఫిరింగీ, 1967 అక్టోబరు 6న విడుదలైన బెంగాలీ బయోగ్రాఫికల్ మ్యూజికల్ సినిమా. బి.ఎన్. రే ప్రొడక్షన్స్ బ్యానరులో బి.ఎన్. రాయ్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ బెనర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉత్తమ్ కుమార్, తనుజ తదితరులు నటించారు. ఆంథోనీ ఫిరింగీ అనే బెంగాలీ జానపద కవి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[1]

సినిమా విడుదలైన తర్వాత, ఆ కవి పేరు ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది.[2] 1968లో జరిగిన 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో నటుడు ఉత్తమ్ కుమార్ జాతీయ ఉత్తమ నటుడిగా (ఆంథోనీ ఫిరింగీ, చిరియాఖానా సినిమాలో నటనకు) అవార్డును అందుకున్నాడు.[3][4]

కథా సారాంశం

[మార్చు]

19 వ శతాబ్దపు బెంగాలీ కవి ఆంథోనీ ఫిరింగీ (హెన్స్‌మన్ ఆంథోనీ), వేశ్య షకీలాల ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అతను వివాహం చేసుకుని సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటాడు.[5]

నటవర్గం

[మార్చు]
  • ఉత్తమ్ కుమార్ (ఆంథోనీ ఫిరింగీ)
  • తనుజ (నిరుపోమ)
  • లోలిత ఛటర్జీ (లలితా ఛటోపాధ్యాయ)
  • భాను బందోపాధ్యాయ (హరిపాద)
  • జహోర్ రాయ్ (ఆనంద బాబు)
  • అసిత్ బరన్ (భోలా మొయిరా)
  • హరిధన్ ముఖర్జీ (హరిధన్ ముఖోపాధ్యాయ)
  • హరధన్ బెనర్జీ (హరధన్ బంద్యోపాధ్యాయ)
  • కమల్ మజుందార్ (రామ్ బసు)
  • మణి శ్రీమణి (గోరక్షనాథ్)
  • ఛాయా దేవి (ఆంథోనీ తల్లి)
  • రుమా గుహ ఠాకుర్తా (జోగేశ్వరి)
  • సోమ చౌదరి (అమీనా)
  • జిబెన్ బోస్

అవార్డులు

[మార్చు]
15వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "Antony Firingee (1967)". Indiancine.ma. Retrieved 2021-08-08.
  2. "Mr & Mrs Antony Firingee". The Telegraph. 4 August 2013. Retrieved 2021-08-08. made famous by Uttam Kumar in the film Antony Firingee
  3. "National Awards for Films: Uttam Kumar (1967)" (PDF). Dff.nic.in. Directorate of Film Festivals. 25 November 1968. p. 29. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 2021-08-08.
  4. 4.0 4.1 The Times of India, Entertainment. "National Awards Winners 1967: Complete list of winners of National Awards 1967". timesofindia.indiatimes.com. Archived from the original on 24 March 2020. Retrieved 11 August 2021.
  5. Russell Campbell (2006). Marked Women: Prostitutes and Prostitution in the Cinema. Univ of Wisconsin Press. p. 182. ISBN 978-0-299-21253-7.

బయటి లింకులు

[మార్చు]