ఛాయాదేవి (బెంగాలీ నటి)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఛాయా దేవి
జననం కనకలతా గంగూలీ
1914
భగల్‌పూర్, బీహార్ మరియు ఒడిషా, బ్రిటీషు ఇండియా
మరణం ఏప్రిల్ 27, 2001
కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తి నటి
క్రియాశీలక సంవత్సరాలు 1930లు - 1980లు

ఛాయా దేవి (1914 - ఏప్రిల్ 26, 2001) గా సినిమా తెరపై పరిచయమైన కనకలతా గంగూలీ అలనాటి బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె 15 యేళ్ల ప్రాయములో జ్యోతిష్ బంధోపాధ్యాయ దర్శకత్వము వహించిన పథేర్ శేషే చిత్రముతో సినీరంగ ప్రవేశము చేసినది.[1] ఈమె బెంగాళీ, హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషలలో 150 పైగా చిత్రాలలో నటించినది. 1936లో విడుదలైన దేబకీ బోస్ చిత్రం సోనేర్ సంసార్ కథానాయకిగా ఈమె తొలిచిత్రం.[2] ఈమె నటే కాక మంచి నర్తకి, గాయని కూడా. 1930వ దశకములో తను నటించిన చాలా సినిమాలలో తనే పాటలు పాడినది. తపన్ సిన్హా చిత్రము, అఫోన్ జాన్ చిత్రములో ఛాయా దేవి పాత్రకు రాష్ట్రపతి పురస్కారము లభించినది. ఈమె హిందీ చలనచిత్ర నటుడు అశోక్ కుమార్ యొక్క పినతండ్రి కూతురు. ఛాయా దేవి, 2001 ఏప్రిల్ 26న మెదడు వాపు, న్యుమోనియాతో కలకత్తాలో మరణించినది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]