ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతిసంవత్సరము ఫిభ్రవరి నెలలో శాసనసభలో ప్రవేశపెడతారు, వచ్చే ఏప్రిల్ నుండి తదుపరి సంవత్సరము మార్చి వరకు ప్రభుత్వ రాబడులు, ఖర్చులు వివరాలు దీనిలో వుంటాయి. బడ్జెట్ కు ముందు ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు.

2019-20[మార్చు]

2019-20 బడ్జెట్ జులై 12 న శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టాడు. 2,27,975 కోట్లతో బడ్జెట లో ఒక్క సంక్షేమానికే ప్రభుత్వం రూ.75 వేల కోట్లకుపైగా కేటాయించింది. రూ1,778.52 కోట్ల రెవెన్యూ లోటును చూపింది. [1][2]

అంశం మొత్తం(రూ.కోట్లలో)
బడ్జెట్ అంచనా 2,27,975.00
రెవెన్యూ వ్యయం 1,80,475.94
మూలధన వ్యయం 32,293.39
రెవెన్యూ మిగులు అంచనా -1,778.52
ఆర్థిక లోటు అంచనా 35,280.00

బడ్జెట్‌కు నవరత్నాల రూపంలో ఒక లక్ష్యం, గమ్యం ఉన్నా, 19 శాతం పెరిగిన బడ్జెట్ కు నిధులు సమకూర్చుకోవడం కష్టమే. రాష్ట్ర రుణభారం ఇప్పటికే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 28.18 శాతానికి చేరుకోవడం (తెలంగాణలో ఇది 21.4 శాతం మాత్రమే), నిధుల కోసం కేంద్ర దయాదాక్షిణ్యాలపై అధారపడటం, బడ్జెట్ కేటాయింపులు విజయవంతం కావడానికి అడ్డంకిగా వుంది. [3]

2019-20 VOA[మార్చు]

2019-20 VOA బడ్జెట్[4][5]

అంశం మొత్తం (రూ.కోట్లలో)
బడ్జెట్ అంచనా 2,26,117.53
రెవెన్యూ వ్యయం 1,80,369.33
మూలధన వ్యయం 29,596.33
రెవెన్యూ మిగులు అంచనా 2,099.47
ఆర్థికలోటు అంచనా 32,390.68

2018-19[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయంగా రూ.1,50,270 కోట్లు. [6]

ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు

 • వ్యవసాయం: రూ.12,355 కోట్లు
 • విద్య (సాంకేతిక విద్యతో కలిపి): రూ.25,003 కోట్లు
 • ఇరిగేషన్: రూ.16,978 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.20,851 కోట్లు
 • పరిశ్రమలు: రూ.3,074.87 కోట్లు
 • బీసీ సంక్షేమం: రూ.12,200 కోట్లు
 • పోలవరం ప్రాజెక్టు: రూ.9,000 కోట్లు
 • రైతు రుణమాఫీ: రూ.4,100 కోట్లు
 • ఎన్టీఆర్ పింఛన్లు: రూ.5,000 కోట్లు

2014-15[మార్చు]

2014-15 బడ్జెటు [7]

2012-13[మార్చు]

18 ఫిభ్రవరి 2012 న 2012-13 సంవత్సరానికి 1,45,854.67 కోట్ల అంచనాతో రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ ను [8] ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టాడు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కాగితరహితంగా ఎలక్ట్రానిక్ రూపంలో విడుదలచేయబడింది.


ఇవీ చూడండి[మార్చు]

మూలాల జాబితా[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 1. బుగ్గన, రాజేంద్రనాథ్ (2019). Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
 2. "నవరత్నాల ధగధగలు". ఈనాడు. 2019-07-13. Archived from the original on 2019-07-14.
 3. "ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: కేటాయింపులు ఘనం, మరి నిధుల మాటేంటి? :అభిప్రాయం". బిబిసి. 2019-07-13. Archived from the original on 2019-07-15.
 4. యనమదల, రామకృష్ణుడు (2019). Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
 5. "ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: రైతుల కోసం పథకం 'అన్నదాత సుఖీభవ'". బిబిసి. 2019-02-05.
 6. అరుణ్, శాండిల్య (2018-03-08). "ఏపీ బడ్జెట్‌లో ఏముంది?.. ఇతర రాష్ట్రాల బడ్జెట్లు ఎలా ఉన్నాయ్?". బిబిసి.
 7. యనమదల, రామకృష్ణుడు (2014). Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
 8. ఈనాడు 19 ఫిభ్రవరి2012