ఆకాశ వీధిలో
| ఆకాశ వీధిలో (2001 తెలుగు సినిమా) | |
అక్కినేని నాగార్జున, రవీనా టాండన్ [1] | |
|---|---|
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
| నిర్మాణం | రామోజీ రావు |
| రచన | సింగీతం శ్రీనివాసరావు |
| తారాగణం | అక్కినేని నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, రవీనా టాండన్, కస్తూరి |
| సంగీతం | ఎమ్.ఎమ్.కీరవాణి |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| విడుదల తేదీ | ఆగస్టు 23, 2001 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
విమానం హైజాకింగ్ ఇతివృత్తంగా తీయబడిన సినిమా ఇది. 'ఆకాశవీధిలో ' తెలుగు చలన చిత్రం 2001, ఆగస్టు,23 న ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున, రవీనా టాండన్,రాజేంద్రప్రసాద్, కస్తూరి ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి సమకూర్చగా , రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
- సంగీతం: ఎం.ఎం కీరవాణి
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- పాటలు: చెంబోలు సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్
- నేపథ్య గానం: దేవిశ్రీ ప్రసాద్, గంగ సితారసు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర, శశి ప్రీతమ్, సురేష్ పీటర్స్
- ఛాయా గ్రహణం: ఎస్.గోపాలరెడ్డి
- ఎడిటింగ్: ఎ.శ్రీకర ప్రసాద్
- నిర్మాత: రామోజీరావు
- నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
- విడుదల:23:08:2001.
పాటల జాబితా
[మార్చు]వెన్నెల్లో ఆడపిల్ల, రచన: చంద్రబోస్, గానం.దేవీశ్రీ ప్రసాద్ , గంగ సితరసు
ఏం స్ట్రోక్ ఇచ్చావు గురు , రచన: భువన చంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
మల్లె చినుకులా వానల్లే , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం.శశిప్రీతం , గంగసితారసు
హోత్తర బేరా బేరా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సురేష్ పీటర్స్ .
బబ్రే బబ్రే , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం. శశి ప్రీతం, గంగ సితారసు.