ఆకాశ వీధుల్లో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశ వీధుల్లో
దర్శకత్వంగౌతమ్ కృష్ణ
రచనగౌతమ్ కృష్ణ
నిర్మాతమనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వనాధ్ రెడ్డి
సంగీతంజూడా శాండీ
విడుదల తేదీ
2022 సెప్టెంబర్‌ 2
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆకాశ వీధుల్లో 2022లో రూపొందిన తెలుగు సినిమా. జి.కె. ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. గౌతమ్‌ కృష్ణ, పూజిత పొన్నాడ, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగర్, దేవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదలైంది.[1]

కథ[మార్చు]

సిద్ధు (గౌతమ్ కృష్ణ) పెద్ద రాక్‌ స్టార్‌ కావాలని చదువును నిర్లక్ష్యం చేసి తన తండ్రి దేవీ ప్రసాద్ తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడి కొన్నాళ్ళ తర్వాత నిషాతో మనం లివింగ్ లో ఉందామని చెప్పగా నిషా తనకు ప్రేమపై నమ్మకం లేదని చెప్పి అతనికి దూరంగా ఉంటుంది. దింతో ప్రేమ విఫలం అయ్యి మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిస అవ్వడంతో అతని జీవితం తలకిందులవుతుంది, అతను ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జి.కె. ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ కృష్ణ
  • సంగీతం : జూడా శాండీ
  • సినిమాటోగ్రఫీ:విశ్వనాధ్ రెడ్డి
  • ఎడిటర్ : శశాంక్
  • పాటలు: చైతన్య ప్రసాద్, శ్రేష్ఠ, రాకేందు మౌళి

మూలాలు[మార్చు]

  1. "సెప్టెంబరులో.. 'ఆకాశ వీధుల్లో'". 15 August 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. "ఆకాశ వీధుల్లో మూవీ రివ్యూ". 2 September 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.