ఆగాకర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకాకరకాయ
ఆకాకర కాయలు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
మొ. డయాకా
Binomial name
మొమోర్డికా డయాకా
ఆకాకరకాయ

ఆగాకర, ఆకాకర లేదా అడవికాకర ఒక చిన్న పాకుడు మొక్క. దీనిని కూరగాయగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉపయోగిస్తారు. ఇది కాకర కాయ జాతికి సంబంధించినది. దీన్ని బోడ కాకరకాయ అని కూడా అంటారు. బీడు భూముల్లో పర్వత ప్రాంతాల్లో, తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్- జూలై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తుంటాయి.[1] కాకర కాయలా పొడవుగా ఉండదు. పొట్టిగా గుండ్రముగా పై ముళ్ళ లాంటి తోలుతో ఉంటుంది.

ఆంధ్ర, అస్సామీ, గుజరాతీ, ఒడిషా, మహారాష్ట్ర వంటకాలలో వాడతారు. కాకరకాయతో పోల్చితే చేదు తక్కువగా ఉంటుంది, కొన్ని సార్లు చేదు లేకుండా ఉంటుంది.

లక్షణాలు

[మార్చు]
  • దుంప వేరున్న ఎగబ్రాకే బహువార్షిక పొద.
  • మూడు నుండి ఐదు నొక్కులు గల సరళ పత్రాలు కలిగివుంటుంది.
  • ఏకాంత పసుపు రంగు పుష్పాలు పూస్తుంది.
  • మృదువైన కంటకాల వంటి ప్రికిల్స్ ఉన్న దీర్ఘవృత్తాకార ఫలాలు కాస్తుంది.

పోషకాలు

[మార్చు]

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఉంటుంది.[2]

బోడ కాకర కాయ మధుమేహంతో బాధపడుతున్నవారికి ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు గ్లైసెమిక్ ఇండెక్స్‌పై ప్రభావితం చేస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో  ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమేకాకుండా శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. బోడ కాకర కాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో  విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-08-03). "Spina Gourd | బోడ కాకరతో బోలెడు లాభాలు.. ఇలా పండించండి..!". www.ntnews.com. Retrieved 2024-08-05.
  2. Rakesh, J. (2022-04-06). "Boda kakarakaya Health Benefits: బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలు". Eruvaaka (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-05.
  3. "Boda kakarakaya: బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..ఇలా తింటే సులభంగా బరువు తగ్గుతారట." Zee News Telugu. 2023-08-06. Retrieved 2024-08-05.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగాకర&oldid=4307951" నుండి వెలికితీశారు