ఆటగదరా శివ
ఆటగదరా శివా | |
---|---|
దర్శకత్వం | చంద్రసిద్ధార్థ |
రచన | మునిసురేష్ పిళ్లె |
తారాగణం | దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది |
ఆటగదరా శివ 2018 లో చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమా దీనికి మాతృక. ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. మునిసురేష్ పిళ్లె సంభాషణలు అందించారు.
కథ
[మార్చు]జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ (ఉదయ్ శంకర్)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ జైల్లో కాపలాదారుడిని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే సహాయం చేయమని అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత దిన పత్రికలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్ అంటూ వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు.[1]
తారాగణం
[మార్చు]- దొడ్డన్న
- ఉదయ్ శంకర్
- హైపర్ ఆది
సాంకేతికవర్గం
[మార్చు]- ఎడిటింగ్: నవీన్ నూలి
- సంగీతం : వాసుకి వైభవ్
- సంభాషణలు : కె.ఎ. మునిసురేష్ పిళ్లె
- దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ
- నిర్మాత : రాక్‌లైన్ వెంకటేష్