ఆదిపూడి రంగనాధరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.రంగనాథరావు
ఆడిపూడి రంగనాధరావు
జననం11 ఏప్రిల్ 1930
పిఠాపురమ్, ఆంధ్రప్రదేశ్, భారత దేశం
మరణండిసెంబరు 18 2014
నివాసంహైదరాబాదు
పౌరసత్వంభారతదేశం
జాతీయతభారతీయుదు
జాతిహిందూ
రంగములుయూరాలజీ
వృత్తిసంస్థలుఆంధ్ర వైద్య కళాశాల,
ఉస్మానియా మెడికల్ కళాశాల
చదువుకున్న సంస్థలుఆంధ్రా మెడికల్ కళాశాల,
క్రిస్టియన్ మెడికల్ కాలేజీ

ప్రొఫెసర్ ఎ.రంగనాథరావు M.B.B.S., M.S., M.Ch., D.Sc. (జననం 1930 ఏప్రిల్ 11 - మరణం 2014 డిసెంబరు 18) భారతదేశానికి చెందిన యూరాలజిస్టు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కిడ్నీ ఆపరేషన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విధనభ్యసించారు. ఇంటర్మీటియట్ ను కాకినాడ లోని. పి.ఆర్ కాలేజీలో పూర్తిచేసారు. విశాఖపట్నం లోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైద్య పట్టాను పొంది 1956 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సేవలనందిస్తున్నారు.ఆయన సర్జరీలో పోస్టుగ్రాడ్యుయేషన్ (ఎం.ఎస్.) ను అదే కళాశాలలో 1962లో పూర్తి చేసారు. తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఆయన యూరాలజీలో మాస్టర్స్ డిగ్రీని 1969 లో వెల్లూరు లోని క్రిస్టియన్ వైద్య కళాశాలలో పూర్తిచేసారు.[1] ఆయన భారతదేశంలో మొదటి యూరాలజిస్టుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కిడ్నీ మార్పిడి చేసిన వైద్యునిగా వినుతికెక్కాడు.

ఆయన 1962-1970 ల మధ్య ఆంధ్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. 1970 నుండి 1983 ల వరకు ఉస్మానియా మెడికల్ కళాశాలలో యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. ఆయన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో యూరాలజీ విభాగానికి గౌరవ సలహాదారుగా ఉన్నారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో 1970 లో ఆంధ్రా మెడికల్ కళాశాలలో మొదటి యూరాలజీ విభాగాన్ని స్థాపించారు.1980 నుండి పోస్టుగ్రాడ్యుయేటు కోర్సును యూరాలజీలో ప్రవేశపెట్టారు. ఆయన వైద్యబృందం 1982 లో ఉస్మానియా జనరల్ హాస్పటల్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి శస్త్రచికిత్స.

25 సంవత్సరాలకు పైగా గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు బోధించారు. ఆయన అనేక భారతీయ విశ్వవిద్యాలయాలకు యూరాలజీ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఎక్జామినరుగా ఉన్నారు. ఆయన జాతీయ యూరాలజీ కాన్ఫరెన్స్ లో సుమారు 35 మౌఖిక ప్రదర్శనలిచ్చారు. ఆయన ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో 12 శాస్త్రీయ పత్రాలను ప్రచుచించారు. భారతదేశంలోని యూరాలజి సొసైటీ యొక్క జాతీయ కాన్ఫరెన్సులలో అనేక శాస్త్రీయ తరగతులను నిర్వహించారు.

ఆయన 19982-89 మధ్య కాలంలో యూరాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకు గౌరవ సెక్రటరీ, ఉపాధ్యక్షులు, అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన హైదరాబాదులోని యితర యూరాలస్టులతో కలసి 1994 లో హైదరాబాదు ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూరాలజీని స్థాపించారు.[2]

ఆయనకు 2009 మార్చి 13 న ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో జరిగిన 13 వ వార్షిక కాన్వొకేషన్లో "డాక్టర్ ఆఫ్ సైన్స్" అవార్డునిచ్చారు.[3]

ఓరేషన్స్[మార్చు]

  • ఆయన 1996 లో ఎండురాలజీ పై "డా.హెచ్.ఎస్.భట్ ఓరేషన్" పై ప్రసంగించారు.[4]
  • డా.యల్లా ప్రసాద్ మెమోరియల్ ఓరేషన్ - 1985.
  • డా. హేమాద్రి సర్కార్ మెమోరియల్ ఓరేషన్ (యూరాలజీలో) -1990.
  • డా.భాస్కర రెడ్ది ఎండోమెంట్ ఓరేషన్ - 1996.

మరణం[మార్చు]

ఆయన 18. 12. 2014 న దివంగతులయ్యారు.[5]

మూలాలు[మార్చు]

  1. About all alumni of Department of Urology, Christian Medical College, Vellore, Tamilnadu, India.
  2. "Hyderabad Institute of Urology". Archived from the original on 2011-01-28. Retrieved 2015-07-15.
  3. "13th Annual Convocation details of NTRUHS at The Hindu". Archived from the original on 2012-11-08. Retrieved 2015-07-15.
  4. "South Zone - Urological Society of India". Archived from the original on 2010-08-29. Retrieved 2015-07-15.
  5. "డాక్టర్ రంగనాథరావు అస్తమయం". Archived from the original on 2015-09-22. Retrieved 2015-07-15.

ఇతర లింకులు[మార్చు]