Jump to content

ఆంధ్ర వైద్య కళాశాల

వికీపీడియా నుండి
(ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి దారిమార్పు చెందింది)
Andhra Medical College
ఆంధ్ర వైద్య కళాశాల
కింగ్ జార్జి హాస్పటల్, విశాఖపట్నం
నినాదంNe Quid Nimis
(Let there be nothing in Excess)
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం19 జూలై 1923
ప్రధానాధ్యాపకుడుడా. ఎస్.వి. కుమార్
అండర్ గ్రాడ్యుయేట్లు200 per year (MBBS)
పోస్టు గ్రాడ్యుయేట్లు164 per year
చిరునామమహారాణీపేట, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంతం

ఆంధ్ర వైద్య కళాశాల (ఆంగ్లం: Andhra Medical College) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం నగరములో 1902 సంవత్సరములో స్థాపించబడి కోస్తా జిల్లాలకు వైద్యసేవలు అందించడానికి వైద్యులను తయారు చేస్తున్న విద్యాసంస్థ.[1]

చరిత్ర

[మార్చు]

విశాఖపట్నంలో వైద్య విద్య క్రితం శతాబ్ద ప్రారంభంలో 1902 సంవత్సరం విక్టోరియా డైమండ్ జూబ్లీ వైద్య పాఠశాలగా ప్రారంభించబడింది. పాత పోస్టాఫీసు దగ్గర దీని స్థాపనకు మహారాజా గోడే నారాయణ గజపతిరావు, మహారాణి చిట్టిజానకియమ్మ సహాయం చేశారు. కొంత కాలం తరువాత వైద్య పాఠశాల ప్రస్తుత శరీరధర్మశాస్త్ర విభాగానికి తరలించబడింది. మొదటి బాచ్ లో 50 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కోర్సును లైసెన్సియేట్ సర్టిఫికేట్ స్టాండర్డ్ ఎ అని పిలిచేవారు.

పాఠశాల భవన వైజాగ్ పట్నం వైద్య కళాశాలగా 1923 జూలై 1 లో 32 విద్యార్థులతో ప్రారంభమైంది. అయితే కాలేజీ పనిచేయడం మాత్రం 1923 జూలై 7లో కెప్టెన్ ఫ్రెడరిక్ జాస్పర్ ఆండర్సన్ ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రారంభమైనా, వైద్య కళాశాల మాత్రం 1923 జులై 19పానగల్ రాజా పానుగంటి రామరాయ అయ్యంగార్ చే ప్రారంభించబడింది.

కళాశాల గ్రంథాలయం

[మార్చు]

ఆంధ్ర వైద్య కళాశాల కేంద్ర గ్రంథాలయం 1930 లో స్థాపించబడింది. 1987 సంవత్సరానికి ఇక్కడ సుమారు 32,000 పుస్తకాలు, 107 పత్రికలు సేకరించబడినవి. ఈ మధ్యకాలంలో గ్రంథాలయం పానగల్ భవంతి దగ్గరలోని నూతన భవంతిలోకి తరలించబడింది.

అనుబంధంగా ఉన్న వైద్యశాలలు

[మార్చు]

కింగ్ జార్జి ఆసుపత్రి పానగల్ రాజా మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 జూలై, 1923 జూలై 19 న ప్రారంభించబడింది. అప్పటి 192 పడకల సామర్ధ్యాన్ని1931-32 కల్లా 270 కి పెంచారు. స్త్రీల, గర్భిణీ స్త్రీల విభాగం 1928లో 40 పడకలతో నిర్మించబడింది. నేత్ర చికిత్సా విభాగం 1932లో 80 పడకలతో నిర్మించారు. ఓ.పి.విభాగం, అత్యవసర సర్వీసుల కోసం ప్రత్యేక భవనం 1940లో నిర్మించారు.దానికి దగ్గరలోనే 36 పడకలతో చిన్న పిల్లల విభాగం 1943 లో నిర్మించి తరువాతి కాలంలో దానిని స్త్రీల విభాగంతో విలీనం చేశారు. పరిపాలనా విభాగం, జంట శస్త్రచికిత్స థియేటర్లు 1951లో నిర్మించారు.

ఆసుపత్రిని విస్తృత పరచి స్వాతంత్ర్యానంతరం మద్రాసు గవర్నరు పేరు మీద భావనగర్ వార్డు 1949లో నిర్మించారు. భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1955లో రాజేంద్ర ప్రసాద్ వార్డు 1955లోను తరువాత ఆరోగ్య శాఖామాత్యులైన రాజకుమారి అమ్రిత్ కౌర్ 1956లో పిల్లల వార్డు ప్రారంభించారు. గుండె చికిత్స కోసం ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ 1986 లో తరువాత హృద్రోగ శస్త్రచికిత్స విభాగం చేర్చబడినవి. ప్రయోగశాలల కోసం ప్రత్యేక విభాగం 1992లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిగా న్యూక్లియర్ వైద్యచికిత్స విభాగం 1993 అక్టోబరు 8 లో ప్రారంభించారు.

ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి, మహారాజా జి.ఎన్.గణపతిరావు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం స్వీకరించింది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉంది.

విభాగాలు

[మార్చు]

ఆంధ్రా వైద్య కళాశాల యందు  ప్రాథమిక శాస్త్రం, పారా క్లినిక్, క్లినిక్ విభాగాలు, పెద్ద స్థాయి ఆధునిక చికిత్సా విభాగాలు అనుభవ్జ్ణులైన నిపుణులుతో కూడిన 34 విభాగములు ఉన్నాయి.

  1. ఎనస్థీషియాలజీ విభాగం
  2. శరీర నిర్మాణ శాస్త్ర విభాగం: ఈ విభాగం 1923న ప్రారంభించారు. మొదటి అధ్యపకులు లెట్. కల్నల్. ఫ్రెడ్రరిక్ జాస్పెర్ అండెర్సొన్. ఈ విభాగమునందు సంగ్రహాలయం ఉంది. రెండు కృత్రిమ మానవ అస్థిపంజరములు డా. ఆర్. కృష్ణారావు చేత దానమివ్వబడినవి. డా. ఎస్ స్వామినాథన్ బహుమతి, డా. అండెర్సొన్ పతకం ఉత్తమ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బహుకరించబడును.
  3. జీవరసాయన విభాగం: ఈ విభాగము 1925 న శరీర శాస్త్రంలో భాగముగా మొదలుపెట్టారు. డా. వి.కె. నారాయణ మీనన్ మొదటి అధ్యాపకులు. రావు బహదూర్, డా. వి.కె. నారాయణ మీనన్ పతకం, డా. ఎం. వి.వి. కృష్ణ మోహన్ జ్ఞాపిక బహుమతి, డా. సీతాదేవీ విశ్వ విద్యాలయ  పతకము ప్రతీ సంవత్సరము ఉత్తమ విద్యర్థులకు అందజేస్తారు.
  4. గుండెజబ్బుల శాస్త్ర విభాగం: ఈ విభాగము 1971 లో 25  పడకలతో ప్రత్యేక సశ్రద్ధా ఉపవిభాగము కొస్తా ఆంధ్ర హృదయ సంస్థ యొక్క జనసహకారము,1981 న ఒక  ప్రత్యేక  భవన నిర్మాణం  ఈ విభాగము కోసం చేసారు.  విభాగమున పడకల సంఖ్య 36,  ప్రత్యేక శ్రద్ధా విభాగములో 18 కి పెంచారు.
  5. కార్డియో థొరాకిక్ విభాగము: ఈ విభాగము 1956 లో డా. సుందర్రామూర్తి మొదటి అధ్యాపకులుగా ప్రారంభమైంది. గుండెశస్త్ర చికిత్స ప్రస్తుత సంవత్సరాలలో విశాఖ ఉక్కు ఖర్మాగారం, కోస్తా హృదయ సంస్థ సౌజన్యముతో మొదలైంది.
  6. దంతశాస్త్ర చికిత్స విభాగం.
  7. చర్మ వ్యాదుల విభాగం
  8. ఎండో క్రైనాలజీ విభాగం
  9. ఫోరెన్‌సిక్ మెడిసన్ విభాగం
  10. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం
  11. సాదారణ శస్త్రచికిత్స విభాగం
  12. వైద్య విభాగము: ఈ విభాగం కింగ్ జార్జి ఆసుపత్రిలో 1923 లో ఆధునీకరించారు. 24 గంటల సేవా ప్రారంబమైంది.  డా. డబ్ల్యు. సి. గ్రే మొదటి అధ్యాపకులు,  ముఖ్య కార్యదర్శి.  జెయపూర్ శ్రీ విక్రమదేవవ్వర్మ పతకము, వేమూరి శివజీ రావు  పతకము, డా.  పి. కుటుంబయ్య బహుమతి ఉత్తమ విద్యార్థులకు ప్రతీ ఏడాది అందజేస్తారు.
  13. సూక్ష్మజీవశాస్త్ర విభాగం:
  14. మూత్ర పిండాల విభాగం
  15. మానవ నరాల శాస్త్ర విభాగం
  16. నరాలశస్త్రచికిత్స విభాగం: ఈ విభాగం 1956 లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ నరాలశస్త్రచికిత్స  విభాగంగా మొదలు అయ్యింది. డా. బాల పరమేశ్వరరావు మొదటి ఆధ్యాపకులు,
  17. నూక్లియర్ మెడిసన్ విభాగం
  18. ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం
  19. ఆప్టమాలజీ విభాగం (నేత్ర వైద్యం)
  20. ఆర్థోపెడిక్స్ విభాగం: దీనిని 1964లో చావలి వ్యాఘ్రేశ్వరుడు ప్రారంభించాడు.
  21. ఒటోర్థినాలజీ విభాగం
  22. పెడియాట్రిక్ సర్జరీ విభాగం
  23. పెడియాట్రిక్స్ విభాగం
  24. పాథాలజీ విభాగం : దీనిని 1923లో టి.ఎస్.త్రిమూర్తి ప్రారంభించాడు. అతను మొదటి ప్రొఫెసర్. పాథాలజీ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను 1946లో ప్రారంభించారు. దీనిని 1953లో అప్‌గ్రేడ్ చేసారు. 1996లో సైటాలజీ విభాగం ప్రారంభమైనది. డా. టి. భాస్కరమీనన్ మెమోరియల్ ప్రైజ్, డా. తాతాచారి మెడల్ లను ప్రతీ సంవత్సరం అందజేస్తారు.
  25. ఫార్మకాలజీ విభాగం
  26. శరీర శాస్త్ర విభాగం
  27. ప్లాస్టిక్ సర్జరీ విభాగం
  28. మనోరోగ చికిత్స విభాగం
  29. రేడియాలజీ విభాగం
  30. రేడియో థెరపీ విభాగం
  31. లైంగిక సంక్రమణ వ్యాధుల విభాగం
  32. కమ్యూనిటీ మెడిసన్ విభాగం: దీనిని 1925లో డాఅ. సి. రామమూర్తి స్థాపించాడు. దీనికి 1955లో సోషన్ అండ్ ప్రివెంటివ్ మెడిసన్ గా నామకరణం చేసారు. ఈ విభాగం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ ప్రైజ్, ఎండోమెంటు మెడల్, శొంఠి దక్షిణామూర్తి పురస్కారం, డా. వల్లభశాస్త్రి ప్రైజ్ లను ఏటా యిస్తుంటుంది.
  33. క్షయ వ్యాధి విభాగం,
  34. యూరో సర్జరీ విభాగం

పూర్వ విద్యార్ధుల సంఘం

[మార్చు]

ఆంధ్ర వైద్య కళాశాల పుర్వ విద్యార్థుల సంఘం (Andhra Medical College Old Students' Association:AMCOSA) 1967 సంవత్సరంలో డా. బ్రహ్మయ్యశాస్త్రి, డా. వ్యాఘ్రేశ్వరుడు కృషి ఫలితంగా స్థాపించబడింది.

ప్రముఖ పూర్వ విద్యార్ధులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vew College details". Archived from the original on 2015-05-05. Retrieved 2018-08-23.

బయటి లింకులు

[మార్చు]