కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల ( కందుల శ్రీనివాస రెడ్డి ఇంజనీరింగ్ మెమోరియల్ కళాశాలా' ) భారతదేశం నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది ఆంధ్ర ప్రదేశ్ యొక్క కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లె వద్ద ఉన్నది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల - తిరుపతి నకు అనుబంధముగా పని చేయు చున్నది. మాజీ కడప పార్లమెంటు సభ్యుడు కందుల ఓబుల రెడ్డి యొక్క కుమారుడు కందుల శ్రీనివాస రెడ్డి, న్యాయవిద్య చదువుతుండగా కొత్త డిల్లీలోని ఒక స్కూటర్ ప్రమాదంలో మరణించిన సందర్భముగా ఈ కళాశాల వారి జ్గ్నాపకంగా 1979 లో స్థాపించబడింది.[1]

వివరములు[మార్చు]

ఈ కళాశాల రాయలసీమ ప్రాంతంలోని ఫిబ్రవరి, 2007 సంవత్సరము[ఆధారం చూపాలి] లోని మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాల. దీని నినాదం చీకటిలో వెలుగులు(గా ఉంటుంది). వివిధ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు నిర్వహణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఈ కళాశాల జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజీ విశ్వవిద్యాలయం, అనంతపురం, తో అనుబంధంగా ఉన్నది.

అందించబడే విద్యలు:

 • బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
 • బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
 • బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
 • బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
 • బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్,
 • బ్యాచిలర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్.

. ఎం.టెక్‌లో

 • సివిల్ ఇంజనీరింగ్ (జియోటెక్నికల్ ఇంజనీరింగ్),
 • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (పవర్ సిస్టమ్స్),
 • ఈసిఈ (డిజిటల్ కమ్యూనికేషన్స్)
 • ఎమ్‌ఈ (సిఏడి/సిఏఎం).
 • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్[ఆధారం చూపాలి]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]