Jump to content

ఆలూరి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
ఆలూరి విజయలక్ష్మి
ఆలూరి విజయలక్ష్మి
జననంఅట్లూరు (గూడపాటి) విజయలక్ష్మి
ఉంగుటూరు, కృష్ణా జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
విద్యఎం.బి.బి.ఎస్., ఎం.ఎస్. (ఆబ్‌స్టెట్రిక్స్‌&గైనకాలజీ)
విశ్వవిద్యాలయాలుఆంధ్ర వైద్య కళాశాల
వృత్తిగైనాకాలజిస్ట్
ఉద్యోగంశ్రీశ్రీ హోలిస్టిక్స్ హాస్పెటల్స్, హైదరాబాద్
ప్రసిద్ధిరచయిత్రి, సంఘసేవకురాలు
Notable work(s)సజీవ స్వప్నాలు
మీరు ప్రేమించలేరు
కౌమార బాలికల ఆరోగ్యం
వైద్యుడు లేనిచోట
THE WAR
పదవి పేరుఛీఫ్ గైనకాలజిస్ట్
రాజకీయ పార్టీలోక్‌సత్తా
మతంహిందూ
భార్య / భర్తఆలూరి మురళీకృష్ణ
పిల్లలుసమీర, తుషార
తండ్రిఅట్లూరు అచ్యుతరామయ్య
తల్లిలక్ష్మీ విలాసం
పురస్కారాలు
వెబ్‌సైటు
http://authoralurivijayalakshmi.com/

ఆలూరి విజయలక్ష్మి పేరుమోసిన వైద్యురాలు, రచయిత్రి, సంఘసేవిక. ఈమె సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW) అనే స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె లక్ష్మీ విలాసం, అట్లూరి అచ్యుతరామయ్య దంపతులకు దత్త పుత్రిక. ఈమె ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యలను కృష్ణా జిల్లా, ఉంగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది.[1] ఎస్.ఎస్.ఎల్.సి.లో జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. ఏలూరులోని సెయింట్ థెరెస్సా కళాశాలలో పి.యు.సి.చదువుకుంది. 1967లో విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టాను పుచ్చుకుంది. తరువాత 1970లో పాట్నాలోని ప్రిన్స్ వేల్స్ వైద్య కళాశాల నుండి ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలు ప్రధాన అంశాలుగా ఎం.ఎస్. చదివి యూనివర్సిటీ మొదటి ర్యాంకుతో ఉత్తీర్ణురాలైంది. 1971లో రామచంద్రాపురంలో గైనకాలజిస్టుగా కొంతకాలం పనిచేసింది. తరువాత కాకినాడలో ప్రసూతి వైద్యం ప్రధానంగా నర్సింగ్ హోమ్‌ను నడిపి నాలుగు దశాబ్దాలకుపైగా సేవలను అందించింది. తరువాత హైదరాబాదులోని ఒక ప్రైవేటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఛీఫ్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నది.[2]

వైద్యరంగం

[మార్చు]

జాతీయ వైద్య జర్నల్స్‌లో ఈమె వ్రాసిన 4 పరిశోధనా పత్రాలు ప్రచురింపబడ్డాయి. కౌలాలంపూర్‌లో జరిగిన అంతర్జాతీయ గైనకాలజిస్టుల, ఒబస్ట్రీషియన్స్‌ల ఫెడరేషన్ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాలలో పత్రసమర్పణ గావించింది. అనేక మంది వైద్య విద్యార్థులకు ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలలో శిక్షణ ఇచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కాకినాడ యూనిట్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది.[2]

సేవారంగం

[మార్చు]

ఈమె "చుండ్రు సుబ్బాయమ్మ రోటరీ ఆశ్రయం" అనే వృద్ధమహిళా ఆశ్రమాన్ని కాకినాడలో స్థాపించి అనేక మంది వృద్ధ మహిళలకు ఆశ్రయాన్ని కల్పించింది. వికలాంగ బాలికలకోసం మహర్షి సాంబమూర్తి రెసిడెన్షియల్ స్కూలు వ్యవస్థాపకులలో ఈమె ఒకరు. సత్యసాయి సేవాసమితి, కాకినాడ వారి సహకారంతో ఈమె ఉచిత ప్రసవ సేవలను, సిజేరియన్ ఆపరేషన్లను 500 మంది నిరుపేద స్త్రీలకు నిర్వహించింది. వృత్తి శిక్షణా శిబిరాలను నిర్వహించి సుమారు 1500 స్త్రీలకు, బాలికలకు శిక్షణ ఇచ్చింది. ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి కంటి పరీక్షలు, దంత పరీక్షలు, చర్మరోగ పరీక్షలు, గుండె పరీక్షలు, గైనిక్ పరీక్షలు చేయించి 50000 మందికి పైగా లబ్ధిని చేకూర్చింది. సుమారు 500 మంది ఉపాధ్యాయులకు బాల బాలికల కౌమార దశ పట్ల అవగాహనను కల్పించే శిక్షణను ఇచ్చింది. కౌమార బాలల ఆరోగ్యం అనే పుస్తకాన్ని రచించి 70 వేల మంది బాలబాలికలకు ఉచితంగా పంపిణీ చేసింది.[3] 1982లో చైతన్య వనితా మండలి అనే సంస్థను, 1992లో సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి నిరుద్యోగ మహిళలకు టైపు, బ్యుటీషియన్ కోర్సు, పెయింటింగ్, గృహోపకరణాల తయారీ, బుట్టల అల్లిక, కుట్టుమిషన్, దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, జిప్ బ్యాగుల తయారీలలో శిక్షణను ఇచ్చి వారికి ఉపాధిని కల్పించింది.

సాహిత్య రంగం

[మార్చు]

ఆలూరి విజయలక్ష్మి తన 18వ యేటి నుండి రచనలు చేయడం ప్రారభించింది. ఈమె మొదటి కథ కాలేజి మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. తరువాత 1962లో ఆంధ్రప్రభ వారపత్రికలో మలుపు అనే కథ ప్రచురింపబడి దీపావళి కథల పోటీలో బహుమతి లభించింది. విశాఖ రచయితల సంఘం, బలివాడ కాంతారావు, అంగర సూర్యారావు, రంగనాయకమ్మ, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు తదితరుల ప్రోత్సాహంతో విరివిగా రచనలు చేయసాగింది. ఈమె దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించింది. కొన్ని అనువాదాలు కూడా చేసింది. ఈమె రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ఆరోగ్య విజయాలు అనే శీర్షికను నిర్వహించింది.

రచనల జాబితా

[మార్చు]

నవలలు

[మార్చు]
  • సజీవ స్వప్నాలు
  • చైతన్య దీపాలు
  • ప్రత్యూష పవనం
  • వెలుతురు పువ్వులు

కథా సంపుటాలు

[మార్చు]
  • మీరు ప్రేమించలేరు
  • మాకీ భర్త వద్దు
  • పేషెంట్స్ చెప్పే కథలు
  • అగ్ని కిరణం
  • జ్వలిత
  • THE WAR (ఆంగ్లం)
  • BATTLE FIELD (ఆంగ్లం)

కథలు

[మార్చు]

ఈమె రచించిన కథల పాక్షిక జాబితా:[4]

  • అగ్ని గుండం
  • అగ్నికిరణం
  • అరుణరేఖ
  • ఆగమగీతి
  • ఉషస్సు
  • ఒంటరి నక్షత్రం
  • ఒట్టు నేను త్రాగను
  • కలల సౌరభం
  • కలసి బతుకుదాం
  • కారుమేఘాలు
  • కార్చిచ్చు
  • కొత్తగాలి
  • గాజులు
  • చిరుదీపం
  • చివరిమజిలీ
  • చీకటి లోపల వెలుగు
  • చైతన్య గీతం
  • జపన
  • జీవజ్వాల
  • జ్వలిత
  • జ్వాల
  • తపన
  • తిరగబట్టానికి...
  • తెల్లారింది
  • ధిక్కారం
  • నరజాతి చరిత్ర సమస్తం
  • నీళ్లు
  • నువ్వు ప్లస్ నీ ఎమ్ ఎస్ - వెరసి నీ ఖరీదెంత?
  • పరుగు
  • పారిజాతం
  • పూదోట
  • పెళ్లికూతురు
  • పొగచూరిన సంస్కృతి
  • ప్రతిఫలం
  • బలి
  • బాబూ నన్ను క్షమించు!
  • భయం
  • మంచుదెబ్బ
  • మరబొమ్మ
  • మలుపు
  • మాకీ భర్త వద్దు
  • మీరు ప్రేమించలేరు
  • ముళ్ళగులాబి
  • మెరవని తారకలు
  • మెరుపు
  • మేధోహత్య
  • యామిని
  • రాక్షసుడు
  • రాజీ
  • రేపటి వెలుగు
  • వలయంలో వనిత
  • వికసించిన విద్యుత్తేజం
  • విరిగిన కెరటం
  • విలువలు
  • వీరనారి
  • వెన్నెల వాకిట్లో
  • వెన్నెలవాన
  • శాపం
  • సంకెళ్ళు
  • సంస్కారం
  • సరైనమందు
  • సాలెగూడు
  • సుగంధం
  • సూడోసయిసిస్

వైద్యవిజ్ఞాన గ్రంథాలు

[మార్చు]
  • మాతృత్వం
  • మన దేహం కథ
  • కౌమార బాలికల ఆరోగ్యం

అనువాద గ్రంథాలు

[మార్చు]
  • వైద్యుడు లేనిచోట
  • మనకు డాక్టర్ లేనిచోట
  • మానసిక వైద్యుడు లేనిచోట
  • తాబేలు మళ్ళీ గెలిచింది
  • తుంప, పిచ్చుకలు
  • యోగాతో నడుమునొప్పి నివారణ

రాజకీయాలు

[మార్చు]

జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన లోక్ సత్తా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరి 10 సంవత్సరాల పాటు జిల్లా కన్వీనర్‌గా పనిచేసింది. 2009లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందింది.[1]

పురస్కారాలు, బహుమతులు

[మార్చు]
  • 1993 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారిచే మహిళాభ్యుదయ రంగంలో కీర్తి పురస్కారం.
  • 1993 - వీరేశలింగం అభ్యుదయ రచయిత్రి పురస్కారం.
  • 1992, 1993 - ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ శాఖచే ఉత్తమ వైద్యపుస్తక రచన అవార్డు.
  • 1994 - కోడూరి లీలావతీదేవి స్మారక సాహిత్య పురస్కారం
  • 1996 - ఆంధ్ర మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల సంఘం వారిచే సత్కారం
  • 1997 - అల్లూరి సీతారామరాజు సాహిత్య కళావేదిక ప్రజ్ఞ పురస్కారం
  • 1999 - ఎస్.బి.ఎస్.ఆర్.కళాపీఠం, తాపేశ్వరం వారిచే సాహిత్య పురస్కారం
  • 2001 - ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే మేటి మహిళ పురస్కారం
  • 2002 - ఔట్ స్టాండింగ్ రోటరీ ప్రెసిడెంట్ అవార్డ్
  • 2002 - సీతారామరాజు కళావేదిక, రాజమండ్రి వారిచే ఆంధ్రశ్రీ పురస్కారం.
  • 2004 - మెగాసిటీ నవకళావేదిక వారిచే వైద్య శిరోమణి పురస్కారం
  • 2004 - కౌమార బాలికల ఆరోగ్యం, వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిర్వహించిన పోటీలో విజేత.
  • 2009 - ఆంధ్ర నాటక కళాసమితి, విజయవాడ వారిచే నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారం
  • 2011 - త్రిపురనేని రామస్వామి చౌదరి సాహిత్య వేదిక వారిచే సావిత్రీబాయి ఫూలే & దుర్గాబాయి దేశ్‌ముఖ్ వారసత్వ పురస్కరం
  • 2012 - ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం
  • 2013 - జ్యోత్స్న కళా పీఠం వారి కథా పురస్కారం
  • 2016 - జ్యోత్స్న కళా పీఠం వారి నవలా పురస్కారం
  • 2019 - కవి సంధ్య సాహిత్య పురస్కారం

పదవులు

[మార్చు]
  • ప్రెసిడెంట్ - చైతన్య వనితా మండలి
  • ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ - సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW)
  • ప్రెసిడెంట్ - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్
  • ప్రెసిడెంట్ - రోటరీ క్లబ్ కాకినాడ
  • డిస్ట్రిట్ ప్రెసిడెంట్ - నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 కె.వి.ప్రసాదవర్మ (16 May 2012). "ఆలూరి విజయలక్ష్మి - నవ్యనీరాజనం 161". నవ్య వీక్లీ: 18–19.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Dr. ALURI VIJAYALAKSHMI". Sri Sri Holistic Hospital. Archived from the original on 26 జనవరి 2022. Retrieved 15 January 2022.
  3. ఆలూరి విజయలక్ష్మి. "Social Services". Dr Aluri Vijayalakshmi. Archived from the original on 12 డిసెంబరు 2022. Retrieved 15 January 2022.
  4. కాళీపట్నం రామారావు. "రచయిత: ఆలూరి విజయలక్ష్మి". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 15 January 2022.