Jump to content

చింతల సీతాదేవి

వికీపీడియా నుండి
(సి. సీతాదేవి నుండి దారిమార్పు చెందింది)
చింతల సీతాదేవి
చింతల సీతాదేవి
జననం21 ఏప్రిల్ 1929
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుసి.ఎస్.దేవి
వృత్తిమెడికల్ కళాశాల ప్రొఫెసర్,ప్రిన్సిపాల్
ప్రసిద్ధిమహిళా శాస్త్రవేత్త

చింతల సీతాదేవి లేదా సి. సీతాదేవి (ఆంగ్లం" : C. Sitadevi) భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో కేమిస్ట్రిలో ఉద్యోగంలో చేరి క్రమంగా అనేక హోదాలకు ఎదిగి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

చింతల సీతాదేవి 1929 ఏప్రిల్ 21 న జన్మించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్యవిద్యనభ్యసించారు. ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నంలో ఎం.డి, ఎఫ్.ఐ.ఎం.ఎస్.ఎ డిగ్రీలని అందుకున్నారు.[2]

ఆంధ్రా మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో ట్యూటరుగా (1954-55), గుంటూరు మెడికల్ కాలేజీలో ట్యూటరుగా (1955-58) పనిచేసారు[3]. సికింద్రాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసరుగా (1958) చేరారు. 1959 లో కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రొఫెసరుగా చేరి 1970 వరకు పనిచేసారు.[4] 1970 లో ఆంధ్రామెడికల్ కళాశాలలో చేరి, 1978 నుండి 81 వరకు వైస్ ప్రిన్సిపాల్ గానూ, 1981 నుండి 84 వరకు ప్రిన్సిపాల్ గానూ పనిచేసారు.

ఆమె మార్చి 6 2009 న మరణించారు.[5]

పరిశోధనలు

[మార్చు]

సీతాదేవి గొప్ప పరిశోధకు రాలు[6]. జీవరసాయన శాస్త్రంలో, రోగ నిర్ధారణా జీవ రసాయన శాస్త్రంలో విశేషంగా పరిశోధన చేసి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు.అంతర్జాతీయ జర్నల్స్ లో 52 కి పైగా పరిశోధనా పత్రాలను రాసి ప్రచురించారు.[7] "జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కెమిస్త్స్ ఆఫ్ ఇండియా" అనే పత్రిక సంపాదక వర్గంలో పరిశోధనా వ్యాసాలను ప్రచురించటంలో కృషి చేశారు.[8]

1975 లో F.A.M.S లో ఫెలో షిప్ అందుకున్నారు. ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సు అకాడమీలో ‘’ఫౌండర్ ఫెలో‘’ గౌరవాన్ని దక్కించుకొన్నారు.[9] అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా వారి గౌరవ సభ్యత్వం అందుకొన్నారు. ఇండియన్ అసోసిఎషన్ ఆఫ్ ఫిజియాలజిస్త్స్ అండ్ ఫార్మకో లాజిస్ట్స్ కు ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా (1977, 1980) ఎన్నికయ్యారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన విదుషీ మణి సీతా దేవి. అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్ట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నాల్గవ సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించి, దేశవ్యాప్త ఘనతను పొందారు.

పూర్వ విద్యార్ధిగా ఆంధ్రా మెడికల్ కాలేజి కి ఎన్నో సేవలందించారు పూర్వ విద్యార్ధుల చేత అపూర్వ సత్కారాన్ని పొందారు .త్రివేండ్రం మెడికల్ కాలేజి వారి సిల్వర్ జూబ్లీ ‘’ఆరేషన్ అవార్డ్ ‘’గ్రహీతగా ప్రతిభకు తగిన గౌరవం సాధించారు.

సీతాదేవి అవార్డు

[మార్చు]

సి.ఎస్.దేవి అవార్డుగా రూ.5000/- లను ఎసిబిఐ ఆరవ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.సి.సీతాదేవి 1980 లో ప్రవేశపెట్టారు. తరువాత స్వంతంగా రూ.5000/- లను ఆమె ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ పరిశోధనలు చేసినవారికి యిస్తారు.[10]

మూలాలు

[మార్చు]
  1. foreword in the text book of "Medical BIochemistry" by M.N.Chatterjea and Rana Shinde
  2. "National Academy of Medical Sciences" (PDF).
  3. DEPARTMENT OF BIOCHEMISTRY, గుంటూరు మెడికల్ కాలేజీ
  4. "Department of Bio Chemistry". Archived from the original on 2015-06-22. Retrieved 2015-06-07.
  5. "Association of Clinical Biochemists of India EXECUTIVE COUNCIL 2009" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-06-07.
  6. MEdRC Subject Experts
  7. Imidazole and metronidazole in the treatment of intestinal amoebiasis ఆమె పరిశోధనా వ్యాసం
  8. "About ACBI". Archived from the original on 2015-07-27. Retrieved 2015-06-07.
  9. "IMSA Fellows & Members Directory" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-06-07.
  10. "Sita Devi Award Papers" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-06-07.

ఇతర లింకులు

[మార్చు]