గబ్బిట దుర్గాప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గబ్బిట దుర్గాప్రసాద్ తెలుగు రచయిత, ఉపాధ్యాయుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

గబ్బిట దుర్గాప్రసాద్ 27-6-1940 న కృష్ణా జిల్లా ఉయ్యూరులో గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి దంపతులకు జన్మించాడు. ఎం ఏ (తెలుగు), బి.ఎస్ సి. బి.ఎడ్ చదివాడు .కృష్ణా జిల్లాపరిషత్తులో 1963 నుండి 1998 వరకు ఫిజికల్ సైన్స్ టీచరుగా, పదానోపాధ్యాయుడుగా పనిచేసాడు. పదవీవిరమణ అనంతరం సరసభారతి సంస్థను స్థాపించాడు. భార్య ప్రభావతి. అతనికి నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

సాహిత్య వ్యాసంగం

[మార్చు]

–  అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు

- జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం , పుస్తకావిష్కరణలు .

-- ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త

--ఆలిండియా రేడియో విజయవాడ లో సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగం

-- విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012 నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలో ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 90 మంది మహిళా మాణిక్యాలపై వ్యాసాలు

రచనలు

[మార్చు]

ముద్రిత రచనలు

వరుస పుస్తకం పేరు వివరాలు
1 ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 27 మంది తెలుగు వేదశాస్త్ర ప్రవీణులు ప్రచురణ 2010 అంకితం క్రీర్తి శేషులు కోమలి సూర్యనారాయణ శాస్త్రి
2 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం జూన్ 2013
3 సిద్ధ యోగిపు౦గవులు అంకితం స్వర్గీయ మైనాయి సౌభాగ్యమ్మ  ఏప్రిల్ 2013
4 మహిళా మాణిక్యాలు అంకితం మైనేని సత్యవతి మార్చి  2014
5 పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 125 మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర
6 దర్శనీయ దైవ క్షేత్రాలు అంకితం కోగంటి సుబ్బారావు శ్రీమతి సావిత్రి 11.01.2015
7 గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు 1090 సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు
8 గీర్వాణ౦- -1 146 కవుల జీవిత విషయాలు అంకితం శ్రీ మైనేని గోపాలకృష్ణ
9 గీర్వాణ౦- -3 462 కవుల జీవిత విషయాలు అంకితం: డా|| భండారు రాధాకృష్ణ మూర్తి , సులోచన
10 మొదటిభాగం [1] దేశ ,విదేశాలలోని 201 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
11 కేమోటాలాజి పిత డా.కొలాచల సీతారామయ్య ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞుడు
12 దైవ చిత్తం ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజినాఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన
13 బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి  కరదీపిక
14 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)

శార్వరి ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

[మార్చు]
వరుస పుస్తకం పేరు వివరాలు
1 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా
2 సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)
3 ఆధునిక అంధ్ర శాస్త్ర మాణిక్యాలు  (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )

శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

[మార్చు]
వరుస పుస్తకం పేరు వివరాలు
1 వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష సాహిత్య అకాడెమి ప్రచురించిన హైదరాబాద్ సంస్కృత అకాడేమి డైరెక్టర్ పి జి. లాల్యే ఇంగ్లీష్ లో రాసిన ‘’మల్లినాథ ‘ఆధారం  గా రాసినది  ’వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి  మనీష ‘
2 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు 42 మంది ఆధునిక విదేశ సంస్కృత  విద్వాంసుల జీవితం, రచనలు - వివిధ దేశాలలో సంస్కృత ప్రచారం
3 Nuclear Physicist Dr. Ankunuri  Venkata Ramayya అణుశాస్త్రవేత్త ఆకునూరి వెంకటరామయ్య బుక్ లెట్ విశేషాలు  కు ఇంగ్లీష్ లో అనువాదం

అంకాత్మక (డిజిటల్) పుస్తకాలు

వరుస పుస్తకం పేరు వివరాలు
1 సమస్త భక్త శిఖామణులు దైవం కోసం, దేశం కోసం, రాజ్యం కోసం, సాహిత్యం కోసం పాటుపడి  చరిత్రలో మిగిలిపోయిన భక్త శిఖామణులు
2 వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ

సంపాదకత్వం వహించిన పుస్తకాలు

[మార్చు]
వరుస రచన వివరాలు
1 మహా  కవితా సంతం అంకితం స్వర్గీయ టి ఎల్  కాంతారావు
2 త్యాగి పే’’రెడీలు’[2] అంకితం బాపు రమణలకు
3 మా అన్నయ్య [3] [4] అంకితం కీశే తాడికొండ భోగ మల్లికార్జునరావుదంపతులు

కొన్ని అంతర్జాల రచనలు

[మార్చు]
వరుస రచన వివరాలు
1 సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ [5]
2 అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు
3 కాశీఖండం [6]
4 భీమఖండం
5 కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం
6 గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి
7 గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం 550 మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు
8 పంచారామ క్షేత్ర విశేషాలు

పురస్కారాలు

[మార్చు]
వరుస సత్కారం వివరాలు
1 విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠంపురస్కారం 20.12.2014
2 విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం జనవరి 2017
3 జ్ఞాన జ్యోతి పురస్కారం నవంబర్ 2019

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]